RG Kar case updates : కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో వైద్యురాలి హత్యాచారం ఘటనపై నిరసనలు ఉధృతమయ్యాయి. పశ్చిమ బెంగాల్ సంయుక్త వైద్యుల వేదిక (WBJPD) దీక్షలకు పూనుకుంటోంది. డిసెంబర్ 19 నుంచి కోల్‌కతా నడిబొడ్డున నిరసన దీక్ష ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. లేడీ డాక్టర్ హత్యాచారం కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ మంజూరు చేయడంపై WBJPD మండిపడుతోంది. ఈ ఘటనపై 90 రోజుల లోపు చార్జ్‌షీట్ సమర్పించడంలో సీబీఐ విఫలం కావడం వల్లే నిందితులు బెయిల్ పొందగలిగారని ఆరోపిస్తోంది.
సీబీఐ చార్జ్‌షీట్‌లో జాప్యం
వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేయడంపై ఐదు వైద్యుల సంఘాల సమాఖ్య WBJPD డిసెంబరు 26 వరకు కోల్‌కతాలోని డోరీనా క్రాసింగ్ వద్ద ఈ నిరసనను చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తును వేగవంతం చేయాలని, కేసులో అదనపు చార్జ్‌షీట్ వెంటనే సమర్పించాలని డిమాండ్ చేస్తోంది. సీబీఐ దర్యాప్తులో జాప్యంపై WBJPD సంయుక్త కన్వీనర్ డాక్టర్ పుణ్యబ్రతా గన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్జి కర్ కేసు నేపథ్యం (RG Kar case Details)
కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో విధుల్లో ఉన్న మహిళా డాక్టర్ మృతి యావత్ భారతదేశంలో కలకలం రేపింది. 2023న ఆగస్టు 9న ఆమె అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఇది అత్యాచారం, ఆపై హత్య సంఘటనకు సంకేతమిచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది, వైద్యులు, మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. ఈ ఘటనలో RG కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ , తాలా పోలీస్ స్టేషన్ మాజీ అధికారి అభిజిత్ మొండాల్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా వీరిద్దరు నిందితులను తేలింది. దీంతో నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఈ క్రమంలో ఈ కేసుపై సీబీఐ విచారణ చేపట్టింది. అయితే.. డిసెంబరు 15న నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చార్జ్‌షీట్ దాఖలు చేయడంలో సీబీఐ ఆలస్యం చేయడం వల్లే నిందితులు బెయిల్ పొందగలిగారని WBJPD ఆరోపిస్తోంది.
హత్యాచార ఘటనపై దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసి, అదనపు చార్జ్‌షీట్‌ను వెంటనే సమర్పించాలని WBJPD డిమాండ్ చేస్తోంది. దర్యాప్తులో జాప్యం న్యాయ వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని అంటోంది.
వైద్యుల భారీ ర్యాలీ
RG కర్ మెడికల్ కాలేజ్ సంఘటన వైద్యుల భద్రతపై పెన్ సవాల్‌గా మారిందని WBJPD ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబరు 16న సీబీఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించింది. వందలాది మంది వైద్యులు ఈ హాజరై నినదించారు. దర్యాప్తు సంస్థ నుంచి జవాబుదారీతనాన్ని కోరారు. వేగవంతమైన చర్యలను డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం అందించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. బ్యూరోక్రటిక్ లోపాలు లేదా దర్యాప్తు ప్రక్రియ జాప్యాల వల్ల ఇలాంటి ఘోరమైన నేరాల్లో దోషులను శిక్షించకుండా వదిలేయడాన్ని తాము సహిచబోమని నిరసన తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..