Richest Beggar : జీవితంలో బాగుపడాలంటే కష్టపడాలి. రెక్కలు ముక్కలు చేసుకుంటేనే సగటు జీవి (Common man) బతుకుబండిని లాగ గలడు. చెమటోడ్చితేనే వ్యక్తిగత, కుటుంబ అవసరాలు తీరుతాయి. విలాస జీవితం గడపాలంటే నాలుగు రాళ్లు ఎక్కువ సంపాదించాలి. పెద్దలు మనకు చెప్పింది ఇదే కదా..! అయితే.. ఇదంతా వేస్టు ముచ్చట అంటున్నారు బిచ్చగాళ్లు. జీవితం (Life) సాఫీగా సాగాలంటే యాచకమే మార్గమని అంటున్నారు. ముఖ్యంగా దేవాలయాలు, మసీదులు, దర్గాల వద్ద భిక్షాటతన చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని నిరూపిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని అజ్మీర్ దర్గా వద్ద ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఓ బిచ్చగాడు (Richest Beggar) ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫోన్ వాడటం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది.
బిచ్చమెత్తుకొనే కొన్నా..
షేక్ అనే దివ్యాంగుడైన వ్యక్తి అజ్మీర్ దర్గా (Ajmer Dargah) వద్ద భిక్షాటన చేస్తూ ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లయెన్సర్ (influencer t) కంట పడ్డాడు. అతడి చేతిలో ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫోన్ ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇన్‌ఫ్లయెన్సర్. దీంతో అతడిని ఇంటర్వ్యూ చేయాలనే ఆసక్తి కలిగింది. బిచ్చగాడి (Begger)తో సంభాషిస్తున్న క్రమంలో ఐఫోన్ గురించి అడిగాడు. ఇదెక్కడిదని ప్రశ్నించగా ఆ బిచ్చగాడు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. దీనిని తన సొంత సంపాదనతో కొనుగోలు చేశానని చెప్పాడు. దీని ఖరీదు ఎంత? అని అడిగితే యాపిల్ స్టోర్‌లో ఈ ఫోన్‌ను రూ. 1 లక్ష 70 వేలకు కొన్నానని తెలిపాడు. ఇంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నిస్తే ఏమాత్రం తడుముకోకుండా భిక్షాటన ద్వారానే సంపాదించానని చెప్పాడు. బిచ్చగాడు షేక్ చెప్పిన ఈ ఆసక్తికర మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Richest Beggar పై రకరకాలుగా నెటిజన్ల కామెంట్లు
బిచ్చగాడు షేక్ వీడియో సోషల్ మీడియాలో వీక్షించిన వారు రకరకాలుగా కామెంట్లు చేశారు.
‘ఇది బెస్ట్ బిజినెస్. పెట్టుబడి అవసరం లేదు’ అని ఒకరు వ్యాఖ్యానించారు. మరొకరు ‘ఈ వృత్తిలో ఎలాంటి సమస్యలు ఉండవు.. ఆనందం మాత్రమే ఉంటుంది’ అని కామెంట్ చేశారు. ఇంకొకరు ‘మధ్య తరగతి వారి కంటే బిచ్చగాళ్లే బాగున్నారు ‘అని పేర్కొన్నారు. మరో నెటిజన్ ఇలాంటి వారిని ప్రోత్సహించొద్దు. ఆకలి తీర్చేందుకు అన్నం పెట్టాలి గానీ, చేతికి డబ్బులు ఇవ్వొద్దని కామెంట్ చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..