Road Collapsed in Lucknow | ఉత్తరప్రదేశ్‌లో విస్తుపోయే ఘటన ఒకటి చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని లక్నో(lucknow)లో రోడ్డు మధ్యలో కుంగిపోయింది(Road Caves In ). దీంతో ఒక్కసారిగా 20 అడుగుల లోతైన భారీ గొయ్యి ఏర్పడడంతో అక్కడున్నవారు భయాందోళనకు గురయ్యారు. దీని సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ రోడ్డు కు రెండు వైపులా బారికేడ్లు పెట్టి వాహనాలు అటువైపు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితంగా భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. వికాస్ నగర్ ప్రధాన రహదారి వెంట పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముందున్న రోడ్డు కుంగిపోయింది. దీంతో అక్కడ ఏర్పడిన 20 అడుగుల లోతులో పెద్ద గొయ్యి చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే మందస్తుగా అక్కడ బారికేడ్లు ఏర్పాటుల చేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
కాగా, పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డు కుంగడంతో ఏర్పడిన పెద్ద గొయ్యిని క్షుణ్ణంగా పరిశీలించారు. ముందస్తు జాగ్రత్తగా వాహనాలను దారిమళ్లించారు. గొయ్యికి రెండు వైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి రోడ్డును మూసివేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరోవైపు ఈ ప్రాంతంలో తరచుగా రోడ్లు కుంగి భారీగా గోతులు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
In Vikas Nagar, Lucknow, India Main Road collapsed, creating a 20-foot pit. Road repairs had been ongoing for months. The incident occurred near the power house, with the municipal commissioner and officials present at the site. pic.twitter.com/MZmXpZZYgR
— BigBreakingWire (@BigBreakingWire) December 16, 2024
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..