Indian Army Day : భారత సైనిక 77వ దినోత్సవం పూణెలో ఈ రోజు అత్యంత ఘనంగా ప్రారంభమైంది. 1949లో ఫీల్డ్ మార్షల్ కె.ఎం.కరియప్ప (Marshal Cariappa) మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమితులైన చారిత్రక నేపథ్యంలో ప్రతి ఏడాది దీన్ని నిర్వహిస్తారు. సైనిక రంగంలో భారతదేశంలో సార్వభౌమత్వం, స్వయం సమృద్ధిని సాధించిన గుర్తింపుగా జరుపుతారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తారు.
సైనిక దినోత్సవంలో రోబిటిక్ డాగ్స్
సైనిక దినోత్సవం పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా రోబోటిక్ జాగిలాలు (Robotic Dogs) నిలిచాయి. మల్టీ యూటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ (MULEs)గా పిలువబడే రోబోటిక్ డాగ్స్‌ను ఈ పరేడ్‌లో ప్రముఖంగా ప్రదర్శించారు. భారత సేన 100కు పైగా ఈ రోబోటిక్ డాగ్స్ (Robotic Dogs)ను తన ఆయుధ శాలకు చేర్చుకుంది. క్లిష్టమైన ప్రదేశాలలో మానవ సైనికులు ఎదుర్కొనే ప్రమాదాలను తగ్గిస్తూ, సైనిక సామర్థ్యాలను పెంచడానికి వీటిని రూపొందించారు. పూణెలోని ఖడ్కిలోని ఐకానిక్ బీఈజీ అండ్ సెంటర్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సౌత్ టర్న్ కమాండ్ ఇన్వెస్టిచర్ సెరెమనీలో ఈ రోబోటిక్ డాగ్స్‌ను ప్రదర్శించారు.
సైనిక దినోత్సవం (Indian Army Day) పరేడ్‌లో మరిన్ని..
భారత సైనిక దినోత్సవంలో రోబోటిక్ డాగ్స్‌తోపాటు వివిధ రెజిమెంటల్ కేంద్రాలకు చెందిన ఎనిమిది ప్రతిష్టాత్మక పరేడ్‌లను ప్రదర్శించారు. అధునాతన ఆయుధాలు, అత్యాధునిక యుద్ధ వాహనాల ద్వారా మన సైన్యం సాంకేతిక నైపుణ్యాన్ని ఆవిష్కరించారు.
Indian Army Day సందర్భంగా రొబోటిక్ డాగ్స్ పరేడ్
LAC पर तैनात हैं रोबॉटिक म्यूल, आज आर्मी डे परेड का बने हिस्सा। #roboticmule #indianarmy #IndianArmyDay #IndianArmyDay2025 pic.twitter.com/EINAHDD4Ny
— Raksha Samachar *रक्षा समाचार*🇮🇳 (@RakshaSamachar) January 15, 2025
భారత సైన్య నేపథ్యం
బ్రిటిష్ సామ్రాజ్యంలోనే భారత సైన్యం ఏర్పడింది. బ్రిటిష్‌కు చెందిన సీనియర్ అధికారులతో దీని అంకురార్పణ జరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా భారత సైన్యంలో ఆ సీనియర్ అధికారులు ఉన్నారు. బ్రిటిష్ చివరి కమాండర్‌గా జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ పనిచేశారు. ఆయన ఆ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత లెఫ్టినెంట్ జనరల్ కె.ఎం. కరియప్ప స్వతంత్ర భారతదేశానికి మొదటి సైనిక అధికారిగా 1949 జనవరి 15న నియమితులయ్యారు. జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ నుంచి ఆయన భారత సైన్యానికి నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు.
కరియప్ప ఘనత
కె.ఎం. కరియప్ప పూర్తి పేరు కోదండరే మాదప్ప కరియప్ప. భారతదేశానికి ఆయన అనేక విజయాలు సాధించి పెట్టారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధానికి నాయకత్వం వహించింది ఆయనే. 1993లో 94 ఏళ్ల వయసులో కరియప్ప కన్నుమూశారు. ఆయన జయంతి (జనవరి 15)ని పురస్కరించుకొని ప్రతి ఏడాది భారత సైన్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. దేశ సమగ్రత, పరిరక్షణ కోసం వీర సైనికులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..