- వసూళ్లకు ప్రైవేట్ సైన్యం.. రోజు లక్షల్లో మామూళ్లు…
- చెక్ పోస్ట్ లో సారు రూల్స్ పాటించాల్సిందేనట..
- వసూళ్లు చేపిస్తాడు..? వాటాలు పంచుతాడు..?
- అవినీతి నిరోధక శాఖను సైతం సారు మేనేజ్ చేస్తాడని చెక్ పోస్ట్ లో ప్రచారం..?
Wankidi checkpost | అక్కడ నాయక్ సాబ్ చెప్పిందే వేదమట, ఆ చెక్ పోస్టులో ఆయన చేసిందే చట్టమని రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రైవేట్ సైన్యాన్ని తయారుచేయడంతోపాటు, వసూళ్లకు పాల్పడడంలో ” నాయక్ సాబ్” ఆరితేరాడని ఆర్టీఏ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ చెక్ పోస్టులో రవాణా శాఖ నిబంధనల కంటే నాయక్ భాయ్ నిభందనలే అమలవుతున్నాయంటే సదరు అధికారి హవా ఏస్థాయిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు.వివరాల్లోకెళితే కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలో ఉన్న వాంకిడి ఆర్టీఏ చెక్ పోస్టులో ప్రైవేట్ వ్యక్తులే మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ల వలే వాసహనదారుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.నిబంధనలకు విరుద్ధంగా చెక్ పోస్ట్ నుండి వెళ్లే ప్రతీ వాహనం నుండి మామూళ్లు వసూళ్లు చేస్తున్న ప్రైవేట్ సైన్యం వసూళ్లు చేసిన మొత్తాన్ని నాయక్ సాబ్ చెప్పినచోట అందిస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది.అవినీతి నిరోధక శాఖ అధికారులతోపాటు రవాణా శాఖ ఉన్నతాధికారులను సైతం అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా చేయడంలో నాయక్ సాబ్ సక్సెస్ అయ్యాడని వాంకిడిలో ప్రచారం జరుగుతోంది.
ప్రైవేట్ సైన్యం జోరు…
కొమురంభీం అసిఫాబాద్ లో ఉన్న వాంకిడి ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద ప్రైవేట్ వ్యక్తులు హాల్ చెల్ చేస్తూ వాహనానికి ఓ రేటు చొప్పున వసూళ్లు చేస్తున్నారని తెలిసింది. రవాణా శాఖ కు సంబంధంలేని సదరు వ్యక్తులు వాహనదారులపై జులుం చేస్తున్నారని, కప్పం కట్టకుండా చెక్ పోస్ట్ దాటే పరిస్థితులు వాంకిడి చెక్ పోస్ట్ లో లేవని వాహనదారులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. సదరు ప్రైవేట్ వ్యక్తులను నాయక్ సాబ్ వసూళ్లు చేసేలా ప్రోత్సహిస్తున్నారని తెలియవచ్చింది.
Wankidi checkpost : హోదాల వారీగా వాటాలు…
నాయక్ సాబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న వసూళ్లకు అంతేలేదని రోజుకు సుమారుగా 15 లకారాలపైనే మామూళ్ల రూపంలో లంచాలు వస్తాయని విశ్వసనీయంగా తెలిసింది. రోజు వచ్చే మామూళ్ల నుండి ఖర్చుల రూపంలో కొంత మొత్తాన్ని పక్కన పెట్టి మిగిలిన మొత్తాన్ని డ్యూటీ వారిగా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లతోపాటు అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు వాతాలుగా పంచుకుంటున్నట్లు ప్రచారం లేకపోలేదు. ఖర్చుల రూపంలో తీసిన మొత్తాన్ని నెలకు ఎవరి వాటా వారికి నాయక్ సాబ్ చేరవేస్తాడని తెలుస్తోంది
ఏసీబీ అంటే భయమే లేదు..?
వాంకిడి చెక్ పోస్టు (Wankidi checkpost |)లో విధులు నిర్వహిస్తున్న ఎంవీఐ లకు, ఏఎంవీఐ లకు భయమంటే ఏంటోకూడా తెలియదట. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అదురు, బెదురు లేకుండా వాహనదారుల నుండి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు తరచూ తనిఖీలు చేస్తున్నప్పటికీ వీరిలో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదని వారి వసూళ్ల విధానాన్ని చూస్తేనే కనిపిస్తోందని వాహనదారులు అంటున్నారు. ఏసీబీ అధికారులను ,ఉన్నతాధికారులను అటువైపు రాకుండా చూసుకునేందుకు నాయక్ సాబ్ ఉన్నాడని ,”టెన్షన్ ఎందుకు దండగా
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..