Sankranti Special Buses : సంక్రాంతి పండగ పూట తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి జేబులను గుల్ల చేస్తోందని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. పండగ పూట స్వగ్రామాలకు వెళ్లేందుకు నగరవాసులు పల్లెబాట పడుతుండగా.. ఇదే అదునుగా చేసుకుని ఆర్టీసీ యాజమాన్యం చార్జీలు పెంచేసిందని ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ఈరోజు నుంచి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులు తీవ్ర రద్దీతో కిటకిటలాడుతున్నాయి.ఈ నేపథ్యంలో.. టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం జనవరి 09 నుంచే సంక్రాంతి స్పెషల్ బస్సులను నడిపిస్తోంది. అయితే.. సంక్రాంతి స్పెషల్ బస్సుల పేరుతో.. టికెట్ రేట్లను అమాంతం పెంచేసి తమను నిలువునా దోచేస్తోందని పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పోస్టులు
ఈ మేరకు ప్రయాణికులు ధరలు పెంచిన టికెట్ల ను ఫొటోలు తీసి సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. సంక్రాంతి పండగ పూట ఆర్టీసీ ధరల భారం మోపిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో.. సంక్రాంతికి స్పెషల్ బస్సుల్లో (Sankranti Special Buses) ఆర్టీసీ దోపిడీ చేస్తుందని వనపర్తికి చెందిన ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు.. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితమే కానీ.. పురుషుల దగ్గర మాత్రం కండక్టర్లు ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేస్తూ జేబులు గుల్ల చేస్తున్నారంటూ ఆరోపించారు. వనపర్తి నుంచి మహబూబ్ నగర్‌కు సాధారణంగా ఛార్జీ రూ.100 ఉంటే.. ఇప్పుడు రూ.140 వసూలు చేస్తున్నారని.. అందుకు సాక్ష్యంగా తన టికెట్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మహిళల ఛార్జీలు కూడా పురుషుల నుంచి వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Sankranti Special Buses : దివ్యాంగులకు పెంచిన ధరలు..
మరోవైపు.. సాధారణ ప్రయాణికులతోపాటు దివ్యాంగులను సైతం వదలడం లేదని పలువురు ప్రయాణికులు ఫైర్ అవుతున్నారు. ఉచిత పథకాల భారాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ టికెట్ రేట్లు రెట్టింపు పెంచి దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు. సాధారణ రోజుల్లో వికలాంగులకు హాఫ్ టికెట్ ఉంటే.. పండుగ పేరుతో వారికి కూడా ఫుల్ టికెట్ చార్జీ తీసుకుంటున్నారని ఆర్టీసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కడ్తల్‌కు సాధారణ రోజుల్లో రూ.70 ఉంటే పండుగ స్పెషల్ బస్సులు అని రూ.120.. అదే కల్వకుర్తికి సాధారణ రోజుల్లో రూ.140 ఉంటే పండుగ స్పెషల్ బస్సులు అని రూ.220 వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రజా పాలనలో పండుగ పేరుతో ఆర్టీసీ టికెట్ రేట్లు అంతకంత పెంచి దోపిడీ
సాధారణ రోజుల్లో వికలాంగులకు హాఫ్ టికెట్ ఉంటే పండుగ పేరుతో వారికి కూడా ఫుల్ టికెట్ తీసుకుంటూ దోపిడీ చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ
హైదరాబాద్ నుండి కడ్తల్ కు సాధారణ రోజుల్లో రూ.70 ఉంటే పండుగ స్పెషల్ బస్సులు అని… pic.twitter.com/gLTcvDtuaQ
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..









1 Comment
[…] పండుగ (Sankranti celebrations) సందర్భంగా లచ్చమ్మ ఆలయంలో […]