Sabarimala Photo Shoot : ప్రపంచ ప్రసిద్ధి చెందిన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని పవిత్రమైన 18 మెట్లపై 23 మంది పోలీసులు గ్రూప్ ఫోటో(Sabarimala Photo Shoot) దిగిన ఘటన కలకలం రేపింది. ఇందుకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆ పోలీసులపై తక్షణమే కఠినమైన శిక్షణ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఏపీ క్యాంప్‌కు చెందిన పోలీసు ఆఫీసర్లు.. ఇప్పుడు కన్నౌర్‌లోని కేఏపీ-4 క్యాంపునకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆ క్యాంపులో సత్ప్రవర్తన పొందేలా పోలీసులకు కఠిన శిక్షణ ఇవ్వనున్నారు.
ఏడీజీపీ ఎస్ శ్రీజిత్ ఆదేశాల మేరకు శిక్షణ కొనసాగనున్నది. క్రమశిక్షణ చర్యల గురించి హైకోర్టుకు తెలియజేశారు. అయ్యప్ప సన్నిధానంలో మెట్లపై నిల్చొని పొటో దిగిన పోలీసులు.. తమ వెనుక భాగాన్ని దేవుడి వైపు ఉంచారు. ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో.. 23 మంది ఆఫీసర్లను శిక్షణ కోసం వెనక్కి పిలిపించారు. సన్నిధానం స్పెషల్ ఆఫీసర్ నుంచి కూడాఏడీజీపీ రిపోర్టును కోరారు.మరోవైపు 18 మెట్లపై పోలీసులు ఫోటోషూట్ చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్ ఖండించింది. అయ్యప్ప భక్తులు ఎవ్వరూ దేవుడికి వెన్ను చూపించరని తెలిపింది. ఆలయ పవిత్రతను పోలీసులు దెబ్బతీసినట్లు వీహెచ్‌పీ మండిపడింది.
1 Comment
[…] Pradesh Weather Updates : ఆంధ్రప్రదేశ్ లో ఫెంగల్ తుపాను ప్రభావంతో భారీగా […]