Indian Railways | అయ్యప్ప మాలధారుల కోసం శబరిమలకు నడిపిస్తున్న ప్రత్యేక రైళ్ల (Sabarimala special trains ) ను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దు చేసింది. యాత్రికుల సంఖ్య రద్దీ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. సాధారణంగా శబరిమల యాత్రా సీజన్ డిసెంబర్ నుంచి జనవరి మధ్య ఉంటుంది. జనవరి 15 వరకు యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంటూ క్రమేణా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) 120కు పైగా ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేసింది. కానీ.. ఇప్పుడు యాత్రికుల సంఖ్య తగ్గడం కారణంగా జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 మధ్య రైళ్లను రద్దు చేసింది.
శరిమలకు రైల్వే సర్వీసులు
శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానికిఇ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వీరి రవాణా సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. రైలు మార్గంలో సౌకర్యవంత, సమయపాలనతో ఈ సేవలు భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ ప్రత్యేక రైళ్లు ప్రతి సంవత్సరానికి డిసెంబర్ 1 నుంచి జనవరి మధ్యకాలంలో నడుస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్, మౌలాలి, కొల్లం, కొట్టాయం వంటి ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి శబరిమల వరకు ఈ ప్రత్యేక రైళ్లను ఆ శాఖ నడిపిస్తోంది. సాధారణంగా ముఖ్యమైన మార్గాల మధ్య 120 కి పైగా ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఇవి మల్కాజ్గిరి, చర్లపల్లి, గుంటూరు, కోయంబత్తూరు, కాట్పాడి, సేలం, త్రిస్సూర్, ఎర్నాకుళం, పాలక్కాడ్, తిరుప్పూర్ వంటి స్టేషన్లలో ఆగుతాయి.ఇదే క్రమంలో రైలులో ప్రయాణించే యాత్రికుల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. జనవరి 15 వరకు ఎక్కువ సంఖ్యలో భక్తులు ప్రయాణిస్తారు. వారి సంఖ్య తగ్గినప్పుడు రైళ్లను సంఖ్య SCR తగ్గిస్తుంది. ఇదే క్రమంలో ఈ సీజన్‌లో పలు ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది.
రద్దు అయిన రైళ్లు ఇవే.. (Sabarimala special trains)
- కాచిగూడ – కొట్టాయం – కాచిగూడ ప్రత్యేక రైలు నం. 07132: ఈ రైలు మల్కాజ్గిరి, చెర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, కాట్పాడి, సేలం, కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూర్, కోలంబ, మరియు ఎర్నాకుళం వంటి స్టేషన్లలో ఆగుతుంది.
- హైదరాబాద్ – కొట్టాయం – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు నం. 07138: ఈ రైలు సికింద్రాబాద్, మౌలాలి, చర్లపల్లి, నల్లగొండ, గుంటూరు, జోలార్పెట్టై, సేలం, త్రిస్సూర్ వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది.
- మౌలాలి – కొల్లాం- మౌలాలి ప్రత్యేక రైలు నం. 07142 : ఈ రైలు ముఖ్యంగా సికింద్రాబాద్, వికారాబాద్, యాదగిరి, రాయచూరు, మంత్రాలయం, ఆదోని, కడప, రజంపేట, ఎర్రగుంట్ల, జోలార్పెట్టై, కోయంబత్తూరు, మరియు ఎర్నాకుళం వంటి విస్తృతమైన మార్గాలను కవర్ చేస్తుంది.
- వీటితోపాటు జనవరి 29న కొట్టాయం – సికింద్రాబాద్(07066), జనవరి 31న మౌలాలి – కొట్టాయం(07167), ఫిబ్రవరి 1న కొట్టాయం – మౌలాలి(07168), జనవరి 24న సిర్పూర్ కాగజ్‌నగర్(07161), జనవరి 26న కొల్లాం – సిర్పూర్ కాగజ్‌నగర్(07162) రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Sabarimala special trains శబరిమల ప్రత్యేక రైళ్లు రద్దు.. కారణమిదే.. !”