Salman Khan Movie | ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు మైథలాజికల్ మూవీస్ చాలానే వచ్చాయి.మహాభారతం(Maha bharatha), రామాయణం (Ramayanam) స్టోరీని తెరకెక్కించడానికి కొందరు డైరెక్టర్ లు ఇప్పటికీ స్క్రిప్ట్ లు రెడీ చేసుకుంటూనే ఉన్నారు. ఆడియన్స్ కూడా ఈ జానర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరిస్తూనే ఉంటారు. ఆడియన్స్ మెచ్చేలా మూవీ తీస్తే చాలు సినిమాను సూపర్ హిట్టు చేస్తూనే ఉన్నారు. టాలీవుడ్ లో ఒకప్పుడు మైథాలజికల్ జానర్లో మూవీ అంటే ముందు గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆరే. ఆయన వేయని క్యారెక్టర్ లేదంటే అతిశయోక్తి కాదు. రాముడిగా,కృష్ణుడిగా, అర్జునుడిగా ఇలా చాలా క్యారెక్టర్ లలో మెప్పించాడు. ఆయన తర్వాత ఆ రేంజ్ లో మెప్పించిన నటుడు లేడని చెప్పొచ్చు.
తర్వాతి తరం డైరెక్టర్స్ మైథాలజికల్ జానర్ ని టచ్ చేయకుండా వేరే జానర్ లో మూవీస్ తీసారు. ఇక లేటెస్ట్ ట్రెండ్ మళ్ళీ కొందరు ఈతరం డైరెక్టర్లు అలాంటి మూవీస్ తీయడానికి ముందుకు వస్తున్నారు. ఆ మధ్యన రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా యాక్ట్ చేశారు. ఆ మూవీ అంతలా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయిన ప్రభాస్ (prabhas)నటనకి మంచి మార్కులే పడ్డాయి. త్రివిక్రమ్(Trivikram)డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేయబోయే మూవీ కూడా మైథలాజికల్ మూవీనే.
బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రామాయణ..
బాలీవుడ్ లో నితీష్ తివారి(nitish tivari)డైరెక్షన్లో రామాయణ అనే భారీ బడ్జెట్ మూవీ కూడా తెరకెక్కుతోంది. ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని విధంగా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, హనుమంతుడిగా బాబీ డియోల్,రావణుడిగా యశ్ ఇలా బడా స్టార్లు నటిస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. వచ్చే ఏడాది దీపావళి కి ఫస్ట్ పార్ట్, ఆ తర్వాత దీపావళికి సెకండ్ పార్ట్ ను రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్ లో ఇంత లార్జ్ స్కేల్ తో మైథలాజికల్ మూవీ వస్తుందనే వార్తతో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వైరల్ అవుతోంది. సల్మాన్ తండ్రి సీరియస్..?
అయితే ఇలాంటి మూవీని 25 ఏళ్ల క్రితమే ప్లాన్ చేశారట. కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan)రాముడిగా,(sonali bendre)సోనాలి బింద్రే సీతగా, సల్మాన్ ఖాన్ సోదరుడు సోహెల్ ఖాన్(Sohel Khan)డైరెక్షన్ లో మూవీని స్టార్ట్ చేశారట.అయితే ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్న పూజ భట్( Puja Bhat), సోహెల్ ఖాన్ ప్రేమలో పడిపోయారట.ఈ విషయం కాస్త సల్మాన్ తండ్రి సలీం ఖాన్ కి తెలిసిపోయింది. దీంతో పూజాభట్ పై సలీం ఖాన్(Saleem Khan)సీరియస్ అయ్యారట. చదీంతో మూవీ నుండి ఆ అమ్మాయి తప్పుకోవాల్సి వచ్చిందని, అప్పటికే దాదాపు సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీలో వేరే వాళ్ళని తీసుకుని రీషూట్ చేయలేమని భావించి ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారని టాక్ వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ రాముడి గెటప్ లో ఉన్న కొన్ని పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అన్ని సక్రమంగా కుదిరి మూవీ కనుక రిలీజ్ అయి ఉంటే సల్మాన్ నుండి ఆ జానర్ లో మరిన్ని మూవీస్ వచ్చి ఉండేవని గుసగుసలు వినబడుతున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.