Sankranthiki Vasthunnam movie review : విక్టరీ వెంకటేష్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉంటాయో మనకు తెలుసు. సంక్రాంతికి ఆయన నటించిన సినిమాలు రిలీజ్ అయి సూపర్ హిట్ లు అయినవి చాలానే ఉన్నాయి. ఇంతకుముందు విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఎఫ్2 ఎఫ్3 మూవీస్ వచ్చాయి. ఈ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన మూడో మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam ) టైటిల్ కు తగ్గట్టుగానే ఈ మూవీ సంక్రాంతి రోజు రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం….
విక్టరీ వెంకటేష్Victary Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్ 3 మూవీస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఎంత అలరించాయో ఈ మూవీ కూడా అంతకంటే ఎక్కువగా కామెడీతో అలరిస్తుంది. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా తనదైన మార్క్ కామెడీ టేకింగ్ తో డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రతి క్యారెక్టర్ తో కామెడీ చేయించిన డైరెక్టర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు.
ఈ మధ్యకాలంలో పూర్తి కామెడీ ఎంటర్టైనర్ రాలేదు. ఈ సినిమా వెంకటేష్ అభిమానులకే కాకుండా సినీ ఆడియన్స్ కి ఒక పండుగని చెప్పొచ్చు. పూర్తి ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించి ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. అనిల్ రావిపూడి సినిమాలు వస్తుందంటేనే కామెడీని ఎక్స్పెక్ట్ చేస్తారు. విక్టరీ వెంకటేష్ కూడా కామెడీని ఎలా ఆడుకుంటారో నువ్వు నాకు నచ్చావ్,మల్లీశ్వరి అంతకుముందు సినిమాలతో మనకు తెలుసు. కామెడీ మూవీతో ఆయన చాలా రోజుల తర్వాత పెద్ద హిట్టు కొట్టారనే చెప్పొచ్చు Sankranthiki Vasthunnam movie review
వెంకటేష్ 75 వ చిత్రంగా తెరకెక్కిన సైంధ వ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చింది. ఆ మూవీ ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది. దీంతో వెంకటేష్ ని సీరియస్ రోల్ లో కాకుండా కామెడీ రోల్ లో చూడాలనుకున్నారు. ఫ్యాన్స్ తన నుంచి ఏమి ఆశించారో వారికి తగ్గట్టుగానే ఈ మూవీ ఉంటుంది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా వింటేజ్ వెంకటేష్ ని చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ప్రతి క్యారెక్టర్ తో డైరెక్టర్ బెస్ట్ పర్ఫామెన్స్ రాబట్టి ఫన్ క్రియేట్ చేశారు.
Sankranthiki Vasthunnam హాయిగా నవ్వుకునేలా..
దీంతో ఆడియన్స్ కి ఎక్కడ కూడా బోర్ కొట్టదు. చూస్తున్నంత సేపు హాయిగా నవ్వుకునేలా ఈ మూవీ ఉంటుంది. ప్రతి సీన్లో అనిల్ రావిపూడి మార్క్ కనబడుతుంది. క్లైమాక్స్ ఈ మూవీ ని మరో లెవల్ కి తీసుకెళ్ళింది. ఆయన గత చిత్రాలు ఎఫ్2 ఎఫ్3 మూవీస్ ఆ తర్వాత వచ్చిన భగవంతు కేసరి ఎంత హిట్ అయ్యాయో అంతకంటే ఎక్కువగా ఈ మూవీ ఉందని చెప్పొచ్చు.
బీమ్స్ (bheems) మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద అసెట్. పాటలు ఇప్పటికే పెద్ద హిట్టుగా నిలిచాయి. తెరపై ఈ పాటలు వచ్చినప్పుడు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్స్ కి తగ్గట్టుగా అద్భుతంగా ఇచ్చారు. ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని చెప్పచ్చు ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ రోల్ లో సరైన గుర్తింపు రావడంలేదని విమర్శలు ఉన్నాయి. ఈ మూవీలో మాత్రం ఒక మంచి పాత్ర దొరికిందని చెప్పవచ్చు. మీనాక్షి చౌదరి. (Meenakshi Choudhary) పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది.
దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వచ్చిన ఈ సినిమా పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీతో ఆయనకు పెద్ద రిలీఫ్. మొత్తానికి సంక్రాంతికి వచ్చిన ‘ సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ పెద్ద బ్లా క్ బస్టర్ అని ఆడియన్స్ అనుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..