Sankranti festival Kites : సంక్రాంతి సందర్భంగా ఎగురవేసే గాలిపటాల (Kites )పై హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ఆంక్షలు విధించారు. పంతగులు ఎగురవేసే సమయంలో డీజే వినియోగంపై దృష్టి పెట్టారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ (CV Amand) ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు. జనవరి 14న జరిగే సంక్రాంతి వేడుకల సందర్భంగా నగరంలోని రహదారులపై పతంగులు ఎగరవేయడం, డీజేలు పెట్టడం పూర్తిగా నిషేధించారు. ఇతర ప్రాంతాల్లో కొన్ని పరిమితులు విధించారు.
కఠిన చర్యలు తప్పవు..
పరిశ్రమల ప్రాంతాల్లో సాధారణంగా పగలు 75 డెసిబెల్స్, రాత్రుళ్లు 70 డెసిబెల్స్ వరకు మాత్రమే శబ్ద స్థాయి అనుమతి ఉంటుంది. వాణిజ్య ప్రాంతాల్లో పగలు 65 డెసిబెల్స్, రాత్రి 55 డెసిబెల్స్ వరకు మాత్రమే పరిమితి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు (Kites) ఎగరేసే సమయంలో టెర్రస్‌లపై DJల వినియోగం విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నగర పోలీసులు వసతి ప్రాంతాల్లో శబ్ద పరిమితిని పగలు 55 డెసిబెల్స్, రాత్రి 45 డెసిబెల్స్‌గా నిర్ణయించింది. నిశ్శబ్ద ప్రాంతాలుగా పేర్కొన్న ఆస్పత్రలు, విద్యాసంస్థల పరిసరాల్లో నియమాలను ఉల్లంఘించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
DJ, లౌడ్‌స్పీకర్ల వినియోగంపై పరిమితి
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సాధారణంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు DJలు, లౌడ్‌స్పీకర్ల వినియోగంపై నిషేధం ఉంది. దీన్ని కచ్చితంగా అమలు చేసి తీరుతామని హైదరాబాద్ నగర పోలీసులు అంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో పతంగులు ఎగురవేసేటప్పుడు డీజేల వినియోగాన్ని కట్టడి చేస్తామంటున్నారు.
శద్ద కాలుష్యాన్ని నివారించేందుకే..
శబ్ద కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, సంక్రాంతి పండుగ సందర్భంలో ఆడియో వ్యవస్థల ద్వారా అధిక శబ్దం సృష్టించడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతింటాయని పోలీసు శాఖ హెచ్చరించింది. సంక్రాంతి వేళ పిల్లలు, వృద్ధులు, రోగులకు శబ్ద కాలుష్యం తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించొచ్చని పేర్కొంది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరించారు.
పతంగుల (Kites) ప్రమాదాలపై హెచ్చరిక
Kites Tragedies in Telangana : సంక్రాంతి వేళ పతంగుల కారణంగా రహదారులపై జరిగే ప్రమాదాలను నివారించేందుకు కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ కమిషనర్ తెలిపారు. రహదారులపై పతంగులు ఎగరడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రోడ్డుపై వెళ్లే ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలను ముందుగా నివారించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ ఆంక్షలను ప్రజలు తప్పకుండా పాటించాలని, నగర శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని కమిషనర్ కోరారు. దీనితోపాటు, సంక్రాంతి వేడుకలను కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
,