Sankranti Movies : సంక్రాంతి వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావిడి కనిపిస్తుంది. మా హీరో సినిమా హిట్ అంటే మా హీరో సినిమా హిట్ అని ఫ్యాన్స్ మధ్య వార్ అగుపడుతుంది. ఈ సంక్రాంతికి ఏఏ సినిమాలు పోటీలో ఉన్నాయి.. ఏఏ కాంబినేషన్లో ఈ మూవీలు వస్తున్నాయో ఒకసారి చూద్దాం…
అప్పుడు ఈ హీరోల మధ్యే పోటీ…
ఈ సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan), కీయారా అడ్వాని (Kiara advani) జంటగా నటించిన గేమ్ చేంజర్, నందమూరి నటసింహం బాలకృష్ణ (Bala krishna)డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ (Venkatesh) సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బరిలో ఉన్నాయి. 2019వ సంవత్సరంలో సంక్రాంతికి కూడా ఈ హీరోలే పోటీపడ్డారు.
అప్పుడు రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్లో వినయ విధేయ రామ, క్రిష్ (Krish) దర్శకత్వంలో బాలకృష్ణ యాక్ట్ చేసిన ఎన్టీఆర్ (NTR) బయోపిక్, అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ ఎఫ్2 మూవీస్ తో పోటీ పడ్డారు. వీటిలో రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ మూవీ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. బోయపాటి రామ్ చరణ్ తో చేయించిన యాక్షన్ సీక్వెన్స్ ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాటలు పరవాలేదు అనిపించాయి.
బాలకృష్ణ క్రిష్ కాంబినేషన్లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి పాత్రలో నటించగా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2 మూవీకి మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కామెడీ సినిమాలు తీసే అనిల్ రావిపూడి వింటేజ్ వెంకటేశ్ ని గుర్తుకు తెచ్చారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ నీ కూడా కొత్తగా చూపించారు. ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకున్న ఈ మూవీ 100 కోట్ల క్లబ్లో చేరి ఆ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
Sankranti Movies కాంబినేషన్ రిపీట్..
అప్పుడు వినయ విదేయ రామ మూవీలోను, ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీలోను కియరా అడ్వాని హీరోయిన్ కావడం, వెంకటేశ్ ఎఫ్2 మూవీని డైరెక్ట్ చేసిన అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం మూవీకి డైరెక్టర్ కావడం విశేషం.
ఇప్పుడు కూడా ఆ హీరోల సినిమాలే వస్తుండడంతో సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 10న గేమ్ చేంజర్, 12న డాకు మహారాజ్ , 14న సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ సంక్రాంతికి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో చూద్దాం..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
2 Comments
[…] -2, సింగం-3, ఆకాశమే హద్దురా సినిమాలు తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఈ […]
[…] వెంకటేష్ (Venkatesh) పక్కన హీరోయిన్ గా సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక పెద్ద మూవీ చేస్తోంది. ఈ మూవీ […]