Telangana Women Teacher Day : రాష్ట్రంలో రేపు సావిత్రి బాయి ఫూలే జయంతి (Savitribai Phule Jayanti) (జనవరి 3) వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా విద్యకు ఎంతో పాటుపడిన సావిత్రిబాయి ఫూలే.. మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించారు. మహిళా సాధికారత కోసం ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. సావిత్రి బాయి ఫూలే జయంతి రోజుని “మహిళా ఉపాధ్యాయ దినోత్సవం”గా నిర్వహించాలని నిర్ణయిస్తూ ఈమేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనవరి 3న శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించనున్నారు.
సావిత్రిబాయి ఫూలే (Savitribai Phule ) గురించి సంక్షిప్తంగా
savitribai phule history : మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ పట్టణంలో 1831, జనవరి 3న ఒక సాధారణ రైతు కుటుంబంలో సావిత్రి బాయి జన్మించారు. ఆమె తల్లిదండ్రుల పేర్లు ఖండోజి నెవెషే పాటిల్, లక్ష్మీ. కాగా 12 ఏళ్లకే సావిత్రిబాయి పూలే వివాహం జరిగింది. ఆమె భర్త జ్యోతిరావు పూలే సామాజిక కార్యకర్తగా పనిచేసేవారు ఆమెకు చదువు పట్ల ఉన్న మక్కువను తెలుసుకున్న జ్యోతిరావు.. స్వయంగా అక్షరాలు దిద్దించారు. ఒకవైపు ఆమె తన కుటుంబాన్ని చూసుకుంటూనే మరోవైపు తన చదువును కొనసాగిస్తూ అహ్మద్ నగర్‌లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848 జనవరి 1న పూణె నగరంలోని బుధవారపేటలో తొలి అతిశూద్రుల బాలికల కోసం భర్తతో కలిసి తొలి పాఠశాలను ప్రారంభించారు. 1855 నాటికి వీరు రాత్రిపూట బడులను కూడా ఆరంభించారు.
ప్లేగు వ్యాధి బారిన పడి సావిత్రిబాయి 1897 మార్చి 10న కన్నుమూశారు. ఆమె జ్ఞాపకార్థం 1983లో పూణే నగర కార్పొరేషన్ ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించింది. 1998 మార్చి 10న ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..