SBI Clerk Notification 2024 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకి శుభవార్త అందించింది. భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు 2024-25 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 13,735 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన విద్యార్హతలు, ఇతర వివరాలు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఖాళీల సంఖ్య
యావత్ భారతదేశం వ్యాప్తంగా 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణలో 342 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్‌లో 50 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియ.. గడువు తేదీలు
- జూనియర్ అసోసియేట్ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 2024 డిసెంబర్ 17
- దరఖాస్తు చివరి తేదీ : 2025 జనవరి 7
- దరఖాస్తు లింక్ : [SBI Careers](https://bank.sbi/web/careers/current-openings)
విద్యార్హతలు
- కనీసం డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
- ఇంటిగ్రేటెడ్ డ్యుయల్ డిగ్రీ (IDD) కలిగినవారు 2024 డిసెంబర్ 31 నాటికి ఉత్తీర్ణత సర్టిఫికెట్ అందించాలి.
- డిగ్రీ ఫైనలియర్‌లో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, 2024 డిసెంబర్ 31 నాటికి వారు పాసైనట్లు నిరూపించాల్సి ఉంటుంది.
వయో పరిమితి
– కనిష్ట వయసు: 20 సంవత్సరాలు
– గరిష్ట వయసు: 28 సంవత్సరాలు
(2024 ఏప్రిల్ 1 నాటికి)
పరీక్షా విధానం
1. ప్రిలిమినరీ పరీక్ష
– వ్యవధి: 1 గంట
– ప్రశ్నలు: 100
– మొత్తం మార్కులు: 100
– విభాగాలు: ఇంగ్లిష్ భాష, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ
– నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కు కోత.
2. మెయిన్స్ పరీక్ష
– వ్యవధి: 2.40 గంటలు
– ప్రశ్నలు: 190
– మొత్తం మార్కులు: 200
– విభాగాలు: జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ & కంప్యూటర్ అప్టిట్యూడ్.
3. భాషా ప్రావీణ్యత పరీక్ష
ప్రదేశిక భాషలో అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.
వేతనం
- ప్రారంభ వేతనం: రూ. 24,050
- గరిష్ట వేతనం: రూ. 64,480
ముఖ్యమైన తేదీలు
- ప్రిలిమినరీ పరీక్ష : 2025 ఫిబ్రవరి
- మెయిన్స్ పరీక్ష : 2025 మార్చి/ఏప్రిల్
SBI Clerk Notification 2024 మరిన్ని వివరాలకు : అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పూర్తి సమాచారం పరిశీలించవచ్చు.
లింక్ : [SBI Careers] ( https://bank.sbi/web/careers/current-openings)
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
1 Comment
[…] Bank Holidays అయితే, ఈ సెలవుల్లో, మీరు మీ బ్యాంక్ మూసి ఉన్నా కూడా మీ పని కోసం ఆన్లైన్ […]