Sankranti Special Trains : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సమయంలో రైళ్లలో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మీదుగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. దీంతో సంక్రాంతి ప్రయాణ ఇబ్బందులు తీరనున్నాయి. ఆ ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవీ..
సికింద్రాబాద్, విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు..
సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలును నడుపుతోంది. 07097, 07098 నంబర్లతో ఈ ట్రైన్ ప్రతీ ఆది, సోమవారాల్లో అందుబాటులో ఉండనుంది. ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఇది సికింద్రాబాద్ స్టేషన్ లో బయలుదేరుతుంది. వైజాగ్ నుండి సోమ వారాల్లో సాయంత్రం 7.50 గంటలకు స్టార్ట్ అయి తరువాత రోజు ఉదయం 11.15 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. ఈ రైలు నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ రైల్వేస్టేషన్లలో ఆగుతుంది.
యశ్వంతాపూర్, భువనేశ్వర్ మధ్య..
భువనేశ్వర్- యశ్వంతాపూర్ మధ్య ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది దక్షిణ మధ్య రైల్వే. 02811, 02812 నంబర్లతో ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. 2025 ఫిబ్రవరి 24 వరకు ఈ రైలు ప్రతీ సోమ, మంగళవారాల్లో నడుస్తుంది. సోమవారం తెల్లవారుజామున 12.15 గంటలకు ఈ రైలు భువనేశ్వర్ నుంచి బయలుదేరుతుంది. మరుసటిరోజు మంగళవారం మధ్యాహ్నం 12.15 గంటలకు యశ్వంతాపూర్ చేరుకుంటుంది.
ఈ రైలు బరంపురం, పలాస, శ్రీకాకుళం, విజయనగరం, కొత్తవలస, సామర్లకోట, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, డోన్, ధర్మవరం, పుట్టపర్తి, స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.
విశాఖ, చెన్నై మధ్య ప్రత్యేక రైలు..
విశాఖపట్నం- చెన్నై మధ్య ప్రత్యేక రైలును నడిపిస్తోంది. 08557, 08558 నంబర్లతో ఈ రైలు నడుస్తుంది. 2025 మార్చి 1 వరకు ఈ రైలు ప్రతి శనివారం ప్రయాణికులకు సేవలందిస్తుంది.సాయంత్రం 7 గంటలకు విశాఖ పట్నంలో బయలుదేరి ఆదివారం ఉదయం 8.45 గంటలకు చెన్నై ఎగ్మోర్ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ తిరుగు ప్రయాణంలో ఎగ్మోర్ నుంచి ఉదయం 10.35 గంటలకు స్టార్ట్ అవుతుంది. 2025 మార్చి 2 వరకు అందుబాటులో ఉంటుంది.
హాల్టింగ్ స్టేషన్లు
- అనకాపల్లి,
- దువ్వాడ,
- యలమంచిలి,
- తుని,
- సామర్లకోట,
- రాజమండ్రి,
- విజయవాడ,
- ఏలూరు,
- ఒంగోలు,
- నెల్లూరు,
- గూడూరు స్టేషన్లు
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Sankranti Special Trains : సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు.. గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే..”