SCR Special Trains | సంక్రాంతి సెలవులు ముగియడంలో స్వగ్రామాలకు వెళ్లిన వారందరూ తిరిగి హైదరాబాద్‌కు తిరుగు పయాణయ్యారు. ఈ క్రమంలో మళ్లీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దృష్ట్యా విశాఖపట్నం నుంచి కొత్త ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను (Special Trains) నడిపిస్తోంది. ఈ రైళ్లు ఈనెల 18, 19వ తేదీల్లో అందుబాటులో ఉండనున్నాయని అధికారులు తెలిపారు.
విశాఖ-చర్లపల్లి-భువనేశ్వర్ (08549/08550)
విశాఖ-చర్లపల్లి-భువనేశ్వర్ రైలు 18వ తేదీ రాత్రి 7.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. 19న ఉదయం 7 గంటలకు చర్లపల్లి స్టేషన్‌కు చేరుతుంది. అదేరోజు ఉదయం 9 గంటలకు చర్లపల్లిలో స్టార్ట్ అయి సాయంత్రం 7.30 గంటలకు వైజాగ్ కు చేరుకుంటుంది. 7.50 గంటలకు బయలుదేరి ఈ నెల 20న తెల్లవారుజామున 2.15 గంటలకు ఒడిశా భవనేశ్వర్ చేరుతుంది.
హాల్లింగ్ స్టేషన్లు :
ఈ రైలుకు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.
SCR Special Trains : విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం (08509/08510)
విశాఖ-చర్లపల్లి-విశాఖ రైలు జనవరి 18న సాయంత్రం 6.20 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి 19న ఉదయం 8 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుతుంది. ఇక తిరుగుప్రయాణంలో అదేరోజు ఉదయం 10 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది.
హాల్లింగ్ స్టేషన్లు :
ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్లలో ఆగుతుంది.
విశాఖ-చర్లపల్లి-విశాఖ (08551/08552)
SCR Special Trains : విశాఖ-చర్లపల్లి-విశాఖ రైలు 19న సాయంత్రం 6.20 గంటలకు విశాఖలో బయల్దేరి ఈనెల 20న ఉదయం 8 గంటలకు చర్లపల్లి స్టేషన్‌కు చేరుతుంది. తిరుగ ప్రయాణంలో ఉదయం 10 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి రాత్రి 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
హాల్టింగ్ స్టేషన్స్ :
ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్లలో ఆగుతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








