Caste Survey in Telangana : రాష్ట్రంలో మరోసారి కులగణన సర్వే వివరాల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka ) వెల్లడించారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు. మూడు పద్ధతుల్లో ఇప్పటివరకు నమోదు చేసుకొని వారికి అవకాశం కల్పిస్తున్నామని ఆయన ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సమగ్ర ఇంటింటి సర్వే పై జరిగిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో కుల గణన (Caste Survey) విజయవంతమైతే దేశమంతా చేయాల్సి వస్తుంది భావించేవారు రీసర్వే కోరుతున్నారని ఆరోపించారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్
బీసీల దశాబ్దాల కల నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం (Congress Govt)తో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు కలిసి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.. రాష్ట్రంలో ఓబీసీలకు విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో 42% రిజర్వేషన్ (BC Reservations) కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దశాబ్దాల బీసీల కలను సాకారం చేస్తాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మార్చి మొదటి వారంలో శాసనసభలో ఓబీసీలకు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తాం.. అంతేకాకుండా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకొస్తాం. పార్లమెంట్లో బిల్లు ఆమోదం కోసం కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో న్యూఢిల్లీకి ప్రతినిధి బృందం పర్యటిస్తుంది. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కూడగడతాం. అని డిప్యూటీసీఎం తెలిపారు.
TG Caste Survey : మూడు శాతం మంది సర్వేకు దూరం
ఇటీవల చేపట్టిన ఇంటింటి సర్వే (TG Caste Survey )లో వివరాలు నమోదు చేసుకోని వారికోసం ప్రత్యకంగా మరో చాన్స్ ఇస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో మూడు శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు. వారికి మరోమారు అవకావం ఇస్తాం. కెసిఆర్, కేటీఆర్ పల్లా, ఇతర పార్టీలవారు కావాలనే సర్వే సిబ్బందికి సమాచారం ఇవ్వలేదు, మరికొందరు సర్వే (Caste census) సిబ్బంది వచ్చినపుడు అందుబాటులో లేకుండా పోయారు. ఇలాంటివారి కోసం మరో చాన్స్ ఇస్తాం. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సమగ్ర ఇంటింటి సర్వేలో వివరాల నమోదుకు తమ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చని, ఫోన్ చేసిన వారి ఇంటికి అధికారులు వెళ్లి అన్ని వివరాలు నమోదు చేసుకుంటారని తెలిపారు.. మండల కార్యాలయాల్లో ప్రజా పాలన సిబ్బంది 10 రోజులు అందుబాటులో ఉంటారు. అక్కడ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు (Caste Details) నమోదుకు చాన్స్ ఇస్తున్నామని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








