టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) రీసెంట్ గా కుబేర (kubera) మూవీతో బంపర్ హిట్ కొట్టారు. ఫస్ట్ టైమ్ ఆయన కాని జోనర్ లోకి వెళ్ళి డీసెంట్ హిట్ అందుకోవడంతో నెక్స్ట్ మూవీ ఎలాంటిది తీయబోతున్నారో అని సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మొదటి నుండి కూడా శేఖర్ కమ్ముల ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.
ఆయన తెరకెక్కించిన హ్యాపీ డేస్, ఆనంద్, ఫిదా, లవ్ స్టోరీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లీడర్ లాంటి మూవీస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మూవీస్ అన్ని కూడా మ్యూజిక ల్ హిట్స్ గా నిలిచాయి. శేఖర్ కమ్ముల సినిమా తీశాడంటే హిట్ అనే టాక్ ఉంటుంది. అంతలా ఆడియన్స్ లో తనదైన మార్క్ చూపించాడు.
కుబేర తో పాన్ ఇండియా డైరెక్టర్…
నాగ చైతన్య (nagachaithanya)తో తీసిన లవ్ స్టోరీ మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని తర్వాత ఎలాంటి మూవీ తీస్తారో అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి పాన్ ఇండియా మూవీ తెరకెక్కించి షాక్ ఇచ్చాడు. ధనుష్, కింగ్ నాగార్జున (Dhanush, nagarjuna)లాంటి టాప్ యాక్టర్స్ ను ప్రాజెక్ట్ లోకి తెచ్చి అంచనాలను పెంచేశారు. ఇది శేఖర్ కమ్ముల మూవీనేనా అని అందరూ అనుకున్నారు.మొదటి నుండి కూడా మూవీ టీం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ప్రమోషన్స్ చేసింది. వారి అంచనాలకు తగ్గకుండా మూవీకి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
Sekhar Kammula : ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ…
ఇప్పటి వరకూ 130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. శేఖర్ కమ్ముల ఇది వరకు తీసిన అన్ని మూవీస్ లో కంటే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిపోయింది. అయితే తన నెక్స్ట్ మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. తర్వాత మూవీ ఒక లవ్ స్టోరీ తెరకెక్కించాలని ఉందని కుబేర సక్సెస్ మీట్ లో కమ్ముల చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీపై ఫిలిం నగర్ లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. సమంత (Samantha)మెయిన్ రోల్ లో ఫీమేల్ ఓరియంటెడ్ మూవీని ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ చేస్తారో లేదా ఫీమేల్ ఓరియంటెడ్ మూవీని ప్లాన్ చేస్తున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








