Chhattisgarh News | శవంతో శృంగారాన్ని అత్యాచారంగా భావించలేమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు (Chhattisgarh High Court) సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్‌పై లైంగిదాడి, హత్యకు సంబంధించిన కేసులో చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ బిభు దత్త గురు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.
అత్యాచారంగా పరిగణించలేం..
మైనర్‌పై హత్యాచార కేసులో నితిన్ యాదవ్, నీలకంఠ్ నాగేశ్ దోషులుగా తేలారు. వీరు బాలికను అపహరించడం, అత్యాచారం చేయడం, హత్య చేయడం వంటి నేరాలకు పాల్పడ్డారని నిర్ధారణ అయ్యింది. నితిన్ యాదవ్ అత్యాచారం, కిడ్నాపింగ్, హత్య నేరాలకు దోషిగా తేలడంతో జీవిత ఖైదు శిక్ష పడింది. నాగేశ్, అతడి సహచరుడికి IPC సెక్షన్ 201 (నేరానికి సంబంధించిన సాక్ష్యాలను తొలగించడం లేదా నిందితుడిని కాపాడేందుకు తప్పుడు సమాచారం ఇవ్వడం)తోపాటు మరికొన్ని సెక్షన్ల ఆధారంగా ఏడేళ్ల జైలుశిక్ష పడింది. అదే కేసులో నాగేశ్‌పై “నెక్రోఫీలియా” (శవంపై లైంగిక చర్య) నిర్వహించినట్లు ఆరోపణ ఉండగా ట్రయల్ కోర్టు అతనిపై IPC , POCSO చట్టం కింద అత్యాచారం కేసు నుంచి విముక్తి కలిగించింది.
ప్రాసిక్యూషన్ వాదనను తోసిపుచ్చిన కోర్టు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం మరణానంతరం కూడా ఆత్మగౌరవం హక్కుగా నిలుస్తుందని, నీలకంఠ్ నాగేశ్ చేసిన పని అత్యాచారం కింద పరిగణించాలని ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దీన్ని న్యాయస్థానం తిరస్కరించింది. శవంతో శృంగార సంబంధం చాలా భయానక నేరమైనప్పటికీ ఇది భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 లేదా పోక్సో చట్టం ప్రకారం అత్యాచార నేరంగా పరిగణించలేమని తీర్పు చెప్పారు.
ప్రాణాలతో ఉన్నప్పుడే చట్టాలు వర్తిస్తాయి..
ఈ సెక్షన్లు బాధితురాలు ప్రాణాలతో ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తాయి. శవంతో అత్యాచారం చేయడం అత్యంత ఘోరమైన నేరమని నిస్సందేహంగా చెప్పొచ్చు. కానీ నేటి చట్టాల ప్రకారం నిందితుడిని సెక్షన్ 363, 376 (3) లేదా పోక్సో చట్టం 2012 సెక్షన్ 6 కింద శిక్షించలేం అని బెంచ్ స్పష్టం చేసింది. యాదవ్, నాగేశ్‌పై విధించిన వివిధ నేరాల శిక్షలను కోర్టు కొనసాగించింది. అయితే.. యాదవ్‌పై అత్యాచారం అభియోగాలు చట్టబద్ధంగా వర్తింపజేయలేమని కోర్టు తీర్పు వెలువరించింది.
ఆ కేసుల్లో మాత్రమే దోషి
కిడ్నాపింగ్, అత్యాచారం, హత్య కేసులో నిందితులైన ఇద్దరు వ్యక్తుల దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఈ కేసులో ఓ బాలికపై మరణించిన తర్వాత కూడా లైంగిక దాడి జరిగినట్లు Bar and Bench రిపోర్ట్ చేసింది. నాగేశ్, మరో నిందితుడు నితిన్ యాదవ్‌కు IPC (భారతీయ శిక్షాస్మృతి), POCSO చట్టం కింద వేర్వేరు నేరాలకు శిక్షలు పడ్డాయి. నితిన్ యాదవ్ అత్యాచారం, కిడ్నాపింగ్, హత్య నేరాలకు దోషిగా తేలడం వల్ల జీవిత ఖైదు పడింది. నాగేష్, అతడి సహచరుడికి IPC సెక్షన్ 201 (నేరానికి సంబంధించిన సాక్ష్యాలను తొలగించడం లేదా నిందితుడిని కాపాడేందుకు తప్పుడు సమాచారం ఇవ్వడం)తోపాటు మరికొన్ని సెక్షన్ల ఆధారంగా ఏడేళ్ల జైలుశిక్ష పడింది. అదే కేసులో నాగేశ్‌పై “నెక్రోఫీలియా” (శవంపై లైంగిక చర్య) నిర్వహించినట్లు ఆరోపణ ఉండగా ట్రయల్ కోర్టు అతడిపై IPC, POCSO చట్టం కింద అత్యాచారం కేసు నుంచి విముక్తి కలిగించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..