Tollywood news | ఒకప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) రేంజ్ వేరు. ఆయన నుండి మూవీ వస్తుందంటే సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయన్నట్టే లెక్క. అన్ని ఇండస్ట్రీ లలో ఎంతటి బడా హీరో అయినా సరే ఆయన మూవీలో యాక్ట్ చేయాలని కోరుకునేవారు. సొసైటీ లోని ప్రాబ్లమ్స్ ని కమర్షియల్ హంగులు జోడించి మూవీ తీసి భారీ హిట్స్ కొట్టడం ఒక శంకర్ కే చెల్లింది.
ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పేరు తెచ్చుకున్న ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ఇప్పుడు ఒక్క హిట్టు కోసం వెయిట్ చేస్తున్నాడు. గత కొద్ది కాలంగా ఆయన నుండి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హవా చూపెట్టలేకపోతున్నాయి. విజయ్ తో తీసిన స్నేహితుడు (snehithudu) మూవీతో తొలి ఫ్లాఫ్ అందుకున్న ఈ డైరెక్టర్ విక్రమ్ ఐ (i) మూవీతో కూడా ఆడియన్స్ ను మెప్పించలేకపోయాడు. ఇక రోబో 2 మూవీ మోస్తరుగా ఆడినా ఆయన రేంజ్ లో హిట్టు కొట్టలేక పోయాడు. కమల్ హాసన్ కు భారతీయుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు ఇచ్చి ఆ మూవీ సీక్వెల్ అనౌన్స్ చేసినప్పుడు ఈ సారి శంకర్ కి హిట్టు గ్యారెంటీ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆ మూవీ భారీ డిజాస్టర్ అయింది. కమల్ హాసన్, శంకర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ సినిమాగా నిలిచిపోయింది.
Shankar Movies : 1000 కోట్ల బడ్జెట్ తో మూడు భాగాలు…
ఇదిలా ఉండగా రామ్ చరణ్ (Ram Charan)గేమ్ చేంజర్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు.కానీ ఈ మూవీ ఆడియన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.ఇక శంకర్ పని అయిపోయిందని విమర్శలు కూడా వచ్చాయి. కానీ శంకర్ మాత్రం ఇవేవి పట్టనట్టుగా తన డ్రీమ్ ప్రాజెక్టు పై ఫోకస్ చేస్తున్నాడు. వేల్పరి (velpari)నవల ఆధారంగా ఓ భారీ బడ్జెట్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. మూడు భాగాలుగా ఈ మూవీ రాబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో భారీ కాస్టింగ్ తో గ్రాండ్ విజువల్స్ తో తీయనున్నట్టు కోలీవుడ్ టాక్.
వేల్పరి కి బడా బ్యానర్ గ్రీన్ సిగ్నల్..?
అయితే ఒకప్పటి శంకర్ అయితే ఈ బడ్జెట్ పెట్టడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చేవారు. ఇప్పుడు శంకర్ వేరు. తనతో మూవీ అంటేనే ఎవరూ కూడా ముందుకు రాలేని పరిస్థితి. ఇన్ని కోట్ల బడ్జెట్ తో రిస్క్ చేయాలంటే కష్టమే.టాలీవుడ్, కోలీవుడ్ బడా బ్యానర్లు ముందుకు రావడం లేదని టాక్ వినబడుతుంది. శంకర్ మాత్రం ఆ స్టోరీపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఓ బడా బ్యానర్ ముందుకు వచ్చిందని త్వరలోనే పట్టాలకెక్క బోతుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.