Shyam Benegal Passed away ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగాల్ తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల పడిలో కన్నుమూశారు. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో సహా సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. భారతీయ సినీ పరిశ్రమకు శ్యామ్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
శ్యామ్ బెనెగల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశాడు. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో శ్యామ్ బెనెగల్ జన్మించారు. శ్యామ్ బెనగల్ భారతీయ సినీ దర్శకుడిగా.. చిత్ర రచయితగా కీర్తిప్రతిష్టలు పొందారు.
Legendary Filmmaker shyam benegal movies చాలా ఏళ్లు టీవీ సీరియల్స్‌లకు దర్శకత్వం వహించిన శ్యామ్ బెనగాల్.. ఆ తర్వాత సినీమా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. శ్యామ్ బెనగల్ అంకుర్ (1974) అనే సినిమాతో ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.
- నిశాంత్ (1975),
- మంథన్ (1976),
- భూమిక, జునూన్ (1978),
- మండి (1983),
- త్రికాల్ (1985),
- అంతర్నాద్ (1991)
శాంబెనెగల్ తనదైన స్టైల్ లో చిత్రాలను తీసి భారతీయ సినీ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో శ్యామ్ బెనెగల్‌ను ఘనంగా సత్కరించింది. 2013లో ప్రఖ్యాత అక్కినేని నాగేశ్వరరావు అవార్డు శ్యామ్ బెనెగల్‌కు ప్రదానం చేశారు. 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం అందుకున్నారు. అంతేకాకుండా. ఏడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..