Sarkar Live

అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం: ఎస్సై  సస్పెన్షన్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సతీష్‌పై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్  సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ​ఎస్సై సతీష్‌పై గత కొంతకాలంగా

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సతీష్‌పై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్  సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

​ఎస్సై సతీష్‌పై గత కొంతకాలంగా ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో జరిగిన అంతర్గత విచారణలో ,విధి నిర్వహణలో భాగంగా పలువురి నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.​నమోదైన కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించడం, బాధితులకు సకాలంలో స్పందించకపోవడంపై విచారణాధికారులు నివేదిక అందించారు.ప్రాథమిక విచారణలో ఈ ఆరోపణలు నిజమని తేలడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సిపి ఆయనను సస్పెండ్ చేశారు.​శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఈ సస్పెన్షన్ ద్వారా పోలీస్ కమిషనరేట్ బలమైన సంకేతాలను పంపింది. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?