leopard Spotted : తెలంగాణలోని పలు జిల్లాల్లో పులి సంచారం ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. ఇటీవల కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా, ములుగు జిల్లా కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతాల్లో పులి సంచరించిన ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు ఇటీవల గుర్తించారు. వెంటనే సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి మందస్తు జాగ్రత్తలుపాటించాలని సూచనలు చేశారు. అయితే సోమవారం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి గ్రామంలో సోమవారం నీటి ట్యాంకు వద్ద పులి సంచారించడాన్ని చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
పత్తి పంటను కోస్తున్న కొందరు స్థానిక రైతులు వ్యవసాయ బావి సమీపంలో పులి పాదముద్రలను గుర్తించి గ్రామస్థులను అప్రమత్తం చేశారు. మొబైల్ ఫోన్‌లలో పులి పాదముద్రలను పొటోలు తీసి అటవీ అధికారులకు తెలియజేశారు. పులి సంచారంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
పులి సంచారాన్ని కుణ్ణంగా పరిశీలిస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు. పెంచికల్‌పేట్ పరిధిలోని అడవుల్లో మహారాష్ట్రకు చెందిన పులి ఇక్కడికి వచ్చి సంచరిస్తోందని పేర్కొన్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా వన్యప్రాణుల వల్ల పంటలకు నష్టం వాటిల్లకుండా విద్యుత్ కంచెలు వేయవద్దని రైతులను కోరారు.
పులితో అకస్మాత్తుగా ఘర్షణ జరగకుండా చూడాలని గ్రామస్తులకు చెప్పారు. కట్టెలు, పశువులు, ఇతర వాటి కోసం అడవులలోకి వెళ్లొద్దని నిర్వాసితులను కోరారు. రైతులు ఉదయం 10 గంటల తర్వాత వ్యవసాయ క్షేత్రాల్లోకి ప్రవేశించాలని, సాయంత్రం 4 గంటలలోపు పొలాలను వదిలి ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. పత్తి సాగు చేసే సమయంలో గుంపులు గుంపులుగా వెళ్లి పనిచేసుకోవాలని పత్తి రైతులు కోరారు.
leopard : దిలావర్ పూర్ మండలకేంద్రంలో..
Sighting of a leopard on highway : నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండల కేంద్రంలోని 61వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చిరుతపులి కనిపించడంతో వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
దిలావర్‌పూర్ మండల కేంద్రం సమీపంలోని దేవాలయం వద్ద చిరుతపులి జాతీయ రహదారిని దాటినట్లు వాహనదారులు తెలిపారు. వారు తమ మొబైల్ ఫోన్లలో పులిని వీడియో రికార్డ్ చేశారు. ఈ ఘటనపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పులికి సంంబంధించినవీడియో క్లిప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది.
కాగా డిసెంబరు 14న ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం డెడ్రా గ్రామంలో అటవీ అంచున ఉన్న తన పశువుల కొట్టం దగ్గర చిరుతపులి దాడితో గ్రామానికి చెందిన భీమాబాయికి స్వల్ప గాయాలయ్యాయి. డిసెంబర్ 4న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్-కాగజ్ నగర్ క్రాస్ రోడ్డు సమీపంలో ఎన్ హెచ్ 363 రోడ్డు దాటుతుండగా చిరుతపులి కనిపించింది. కాగా, మంచిర్యాల లక్సెట్టిపేట రేంజ్ అడవుల్లో పులి సంచరిస్తోంది. దాని పగ్‌మార్క్‌లు రికార్డ్ అయ్యాయి. పొరుగున ఉన్న కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం నుంచి జిల్లా అడవుల్లోకి ప్రవేశించింది. వేమనపల్లి మండలం అడవుల్లో ఇప్పటికే పులి నివాసం ఉంటోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..