Simhachalam Temple Tragedy : సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం సమయంలో అప్పన్న సన్నిధిలో అపశృతి చోటుచేసుకుంది. రూ. 300 టికెట్ కౌంటర్ వద్ద గాలి, వానకు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహాయకసిబ్బంది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను కేజీహెచ్ హాస్పిటల్‌కి తరలించారు.
Simhachalam : భారీ వర్షంతో కూలిన గోడ
సింహాచలం చందనోత్సవం సమయంలో భారీ వర్షం కురియడంతో గోడ కూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ప్రసాదం స్కీం కింద అక్కడ గోడ కట్టారు. అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు. అందులో భాగంగా గోడ నిర్మించారు. ఆ గోడ పక్కనుంచే రూ. 3 వందల టిక్కెట్ లైన్ ఉంది. బుధవారం తెల్లవారుజాము 2:30 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో గోడ కూలింది. ఆ ప్రక్క నుంచి క్యూ లైన్ నుంచి వెళుతున్న భక్తులపై గోడ పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. క్షతగాత్రుల తరలింపుకు 17 అంబులెన్సులు ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు కొనసాగు తున్నాయి.
Simhachalam Temple Tragedy : కాగా మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో సాప్ట్‌వేర్ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు, శైలజ, ఆమె తల్లి పైలా వెంకటరత్నం, మేనత్త గుజ్జరి మహాలక్ష్మి ఉన్నట్లు గుర్తించారు. వీరంతా విశాఖపట్నం నగరానికి చెందిన వారు. మృతుల వివరాలు..ఇలావున్నాయి. పత్తి దుర్గాస్వామి నాయుడు (32), మాచవరం, తూర్పుగోదావరి జిల్లా, ఎడ్ల వెంకటరావు (48) అడవివరం, విశాఖపట్నం, కుమ్మపట్ల మణికంఠ (28), మాచవరం, తూర్పు గోదావరి జిల్లా, గుజ్జరి మహాలఁ్‌మి (65), హెబీ కాలనీ, వెంకోజీ పాలెం, విశాఖపట్నం, పైలా వెంకటరత్నం (45), ఉమానగర్, వెంకోజీ పాలెం, విశాఖపట్నం, పిళ్లా ఉమామహేశ్ (30), చంద్రంపాలెం, మధురవాడ, విశాఖపట్నం, పిళ్లా శైలజ (26) చంద్రంపాలెం, మధురవాడ, విశాఖపట్నం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.