Smart Phone : నిరంతరంగా యూట్యూబ్‌లో షార్ట్ వీడియోలు (YouTube Shorts), ఇస్టాగ్రామ్‌లో రీల్స్ (Insta Reels) చూస్తున్నారా? అయితే.. అలర్ట్‌గా ఉండాల్సిందే. చిన్న వీడియోలు వీక్షిస్తూ కాలక్షేపం చేసేవారిలో అధిక రక్తపోటు (హైబీపీ) సమస్య రావచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా యువత, మధ్య వయసు ఉన్నవారు దీని బారిన పడొచ్చని హెచ్చరిస్తున్నారు. నిరంతరంగా షార్ట్ వీడియోలు, రీల్స్ (Reels) చూసే వారిలో హైబీపీ(High BP) అనే సమస్య పెరుగుతోందని ఓ అధ్యయనంలో తేలింది.
అధ్యయనం ఏం చెబుతోందంటే…
చైనాలోని హెబీ మెడికల్ యూనివర్శిటీ (HB Medical University) కి చెందిన ఫస్ట్ హాస్పిటల్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. కంటిన్యూగా చిన్న వీడియోలు చూడ్డం అనర్థదాయమని ఇందులో వెల్లడైంది. 4,318 మంది యువకులు, మధ్యవయస్కులపై అధ్యయనం చేయగా ఈ షాకింగ్ ఫలితాలు వచ్చాయి. నిద్రకు ముందు చిన్న వీడియోలు చూడటానికి గడిపే సమయాన్ని కూడా అధ్యయనకారులు పరిశీలించారు. ఆ సమయంలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి నిద్రకు ముందు ఎక్కువ సేపు మొబైల్ స్క్రీన్ (Mobile) చూడ్డం వల్ల రక్తపోటు సమస్య ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. నిద్రకు ముందు చిన్న వీడియోలు చూసే స్క్రీన్ టైమ్, రక్తపోటు మధ్య స్పష్టమైన సంబంధం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. దీని నివేదిక BMC Public Health పత్రికలో ప్రచురితమైంది.
Smart Phone : నియంత్రణకు సూచనలు
నిద్రకు ముందు వీడియోలు చూసే సమయాన్ని కట్టడి చేయాలని పరిశోధకులు సూచించారు. అలాగే శరీర బరువు, రక్తంలో కొవ్వు, షుగర్, యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడం, అధిక ఉప్పు ఉన్న ఆహారాన్ని తగ్గించడం వంటి జీవనశైలి మార్పులు రక్తపోటు తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.
డబ్ల్యూహెచ్‌వో గణాంకాలు
ప్రపంచవ్యాప్తంగా 30-79 సంవత్సరాల వయస్సు గల 1.3 బిలియన్ మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు చెబుతున్నాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్, సడన్ డెత్‌కు ప్రధాన కారణంగా మారొచ్చని హెచ్చరిస్తోంది.
వైద్య నిపుణుల సూచన
- Smart Phone స్క్రీన్ టైమ్ పరిమితం చేయండి: నిద్రకు ముందు స్క్రీన్ టైమ్ గడపడం వల్ల మెదడు దృష్టి మరలడం, నిద్రలేమి, హై బీపీ సమస్యలు రావచ్చు. అందువల్ల రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించాలి.
- శరీర బరువును కాపాడుకోండి : రక్తపోటు పెరగడానికి అధిక బరువు లేదా ఒబేసిటీ ప్రధాన కారణం. వ్యాయామం, పోషకాహార ఆహార పద్ధతులు, సరైన జీవనశైలి ద్వారా బరువును నియంత్రించొచ్చు.
- ఆహారపు అలవాట్లను మార్చండి: అధిక ఉప్పు (సోడియం) కలిగిన ఆహారాన్ని తగ్గించడం.
కూరగాయలు, పండ్లు, తక్కువ కొవ్వు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం.
అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్ తక్కువగా తీసుకోవడం మంచిది. - శారీరక వ్యాయామం: వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం (వాకింగ్, సైక్లింగ్, లేదా యోగా) చేయడం రక్తపోటు తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
- మానసిక ఒత్తిడి తగ్గించుకోండి: నిరంతరం స్క్రీన్ చూసే అలవాటు మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మెడిటేషన్, ప్రకృతిలో గడపడం వంటి సాధనాల ద్వారా ఒత్తిడిని తగ్గించొచ్చు.
- మెడికల్ చెకప్‌లు : మీ రక్తపోటు స్థాయిలను తరచుగా పరీక్షించుకోవడం, ఏవైనా సమస్యలు ముందుగానే గుర్తించడం ముఖ్యం.
సాంకేతికతతో సంబంధం
ఈ రోజుల్లో సాంకేతికత మన జీవితంలో అంతర్భాగమైంది. కానీ దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. ఎక్కువసేపు ఫోన్లు చూడడం, ముఖ్యంగా రాత్రి నిద్రకు ముందు వీడియోలు చూడటం, శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..