Snowfall in Himachal Pradesh News హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మంచు బీభత్సం సృష్టించింది. క్రిస్మస్ వేడుకలు జరుగుతున్న వేళ ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. సిమ్లా, మనాలి (Shimla, Manali)తోపాటు ఇతర హిల్ స్టేషన్లలో భారీగా మంచు (Snowfall ) కురవడంతో సుమారు 223 రహదారులు మూసుకుపోయాయి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గత 24 గంటల్లో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. నలుగురు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు.
మంచులో కూరుకుపోయిన వాహనాలు
క్రిస్మస్ ( Christmas) సంబరాల సందర్భంగా భారీ మంచు కురవడాన్ని పర్యాటకులు ఎంతో ఆనందంగా ఆస్వాదించారు. ఈ దృశ్యాన్ని చూసి కేరింతలు కొట్టారు.. ఎంతో ఎంజాయ్ చేశారు. అయితే.. మరో వైపు సిమ్లా, మనాలిలోని అనేక ప్రదేశాల్లో దట్టమైన మంచు అతి భారీ స్థాయిలో కురిసింది. దీంతో ఆ ప్రాంతమంతా తెల్లగా మారిపోయింది. దీంతో 223 రహదారుల్లో సుమారు 500 వాహనాలు ఎక్కడిక్కడే స్తంభించాయి. దట్టమైన మంచులో కురుకుపోయాయి. స్తంభించిన రోడ్లల్లో మూడు జాతీయ రహదారులు కూడా ఉన్నాయి.
పర్యాకుల రద్దీ పెరిగిన క్రమంలో..
సిమ్లా హోటల్ అండ్ టూరిజం స్టేక్‌హోల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కె. సేథ్ పీటీఐకి ఇచ్చిన సమాచారం ప్రకారం.. క్రిస్మస్ సందర్భంగా పర్యాటకుల సంఖ్య భారీగా పెరగడంతో సిమ్లాలో 70 శాతం హోటళ్లు బుక్ అయ్యాయి. మంచు పడుతుండటంతో పర్యాటకులు ఆ ప్రదేశాన్ని సందర్శించేందుకు మరింత ఆసక్తి చూపారు. దీంతో బుకింగ్‌లు 30 శాతం పెరిగాయి. ఇదే క్రమంలో కిన్నౌర్, లాహౌల్ అండ్ స్పితి, సిమ్లా, కులు, మండీ, చంబా, సిర్మౌర్ జిల్లాల్లో దట్టమైన మంచు కురిసింది. దీంతో అట్టారి-లేహ్ మధ్య జాతీయ రహదారి, కులు జిల్లాలో సంజ్-ఆట్, కిన్నౌర్ జిల్లాలో ఖాబ్ సంగం, లాహౌల్ అండ్ స్పితి జిల్లాలో గ్రామ్ఫూ రోడ్డు మూసుకుపోయాయి.
Snowfall : మంచు ఎంత కురిసిందంటే..
ఖద్రాలా – 24 సెం.మీ, సాంగ్లా – 16.5 సెం.మీ, శిలారో – 15.3 సెం.మీ, చోపాల్, జుబ్బల్ – 15 సెం.మీ, కల్పా – 14 సెం.మీ, నిచార్ – 10 సెం.మీ, సిమ్లా – 7 సెం.మీ, పూహ్ – 6 సెం.మీ, జోట్ – 5 సెం.మీ.
ఎక్కువ నష్టం సిమ్లాలోనే..
దట్టమైన మంచు కురవడంతో ఒక్క సిమ్లాలోనే 145 రహదారులు ప్రభావితమయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అలాగే రాష్ట్రం లోని అనేక ప్రాంతాల్లో 356 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమై విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దట్టమైన మంచు కురిసి అపశ్రుతి చోటుకున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. 268 యంత్రాలను వినియోగించి రహదారులను పునరుద్ధరించడంలో నిమగ్నమైంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..