Son kills mother : రంగారెడ్డి జిల్లా చెవెళ్ల (Chevella)లో జరిగిన దారుణ సంఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్నతల్లిని కొడవలితో దాడి చేసి హతమార్చాడు. ఆ తర్వాత గ్రామస్థులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
చెవెళ్ల మండలంలోని రెగడఘనపూర్ గ్రామం (Regadghanapur)లో నివసిస్తున్న జంగయ్య తన తల్లి నర్సమ్మ (75)తో కలిసి ఉండేవాడు. మద్యం మత్తులో అతడు తల్లితో ఏదో ఒక విషయంపై వాగ్వాదానికి దిగాడు. కొద్ది సేపటికే అతడు మరింత కోపోద్రిక్తుడై విచక్షణ కోల్పోయి ఉన్మాదిగా మారాడు. ఇంట్లోనే ఉన్న కోడవలిని తీసి తల్లిపై దాడి చేసి (attacking) అత్యంత కిరాతకంగా గాయపర్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన శనివారం రాత్రే జరిగినప్పటికీ ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నర్సమ్మ మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే జంగయ్యను పట్టుకొని చెట్టుకు కట్టేసి పోలీసుల (police)కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. నర్సమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
గ్రామంలో విషాద ఛాయలు
ఒక కుమారుడు తన తల్లినే మద్యం మత్తులో ఇంత క్రూరంగా హత్య చేయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నర్సమ్మకు గ్రామంలో మంచి గౌరవం ఉండేది. ఆమె మృతి స్థానికులను కలచివేసింది. మద్యం మానవ సంబంధాలను ఎంత భయంకరంగా దెబ్బతీస్తుందో దీంతో స్పష్టమవుతోందని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. జంగయ్యకు కఠిన శిక్ష విధించాలనే పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    