Chandrayaan 5 mission : చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 250 కిలోల బరువున్న రోవర్‌ను చంద్రుని ఉపరితలంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (Indian Space Research Organization (ISRO) ఇక ప్రయోగించనుంది. భారత ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ (ISRO Chairman V Narayanan) ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక ఘట్టంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశంగా భారత్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్ ప్రోగ్రామ్ (Chandrayaan programme) భారత చంద్ర అన్వేషణ కార్యక్రమంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా నాలుగు ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇటీవల చంద్రయాన్-3 ద్వారా భారతదేశం చంద్రుని దక్షిణ ధృవంపై సులువుగా దిగిన ప్రపంచంలోని తొలి దేశంగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా భారత్ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా నిలిచింది.
Chandrayaan 5 mission : జపాన్‌తో కలిసి అద్భుత ప్రయోగం
ఇప్పుడు చంద్రయాన్-5 ద్వారా మరో అద్భుతమైన ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. ఈ మిషన్‌ను జపాన్‌తో కలిసి నిర్వహించనున్నట్లు చైర్మన్ (ISRO Chairman V Narayanan) ప్రకటించారు. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం ద్వారా మిషన్ శాస్త్రీయ సామర్థ్యాలను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చంద్రయాన్-5 లో గత మిషన్ల కంటే అధునాతనమైన సాంకేతికతను వినియోగించనున్నారు.
250 కేజీల రోవర్.. గతం కంటే భారీ
మునుపటి చంద్రయాన్-3 మిషన్‌లో 25 కేజీల బరువున్న ప్రజ్ఞాన్ రోవర్‌ను చంద్రునిపై పంపారు. ఇప్పుడు చంద్రయాన్-5 లో 250 కేజీల భారీ రోవర్ (250-kg rover)ను ప్రయోగించనున్నారు. ఇది చంద్రుని ఉపరితలాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి, అతి సూక్ష్మమైన భౌతిక లక్షణాలను పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ చంద్రయాన్-5 మిషన్‌కు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని, ఇది అత్యంత ఆధునికమైన మిషన్‌గా మారబోతుందని చెప్పారు.
వరుస ప్రయోగాలు ఇలా..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గతంలో 2008లో చంద్రయాన్ -1ను ప్రయోగించి, చంద్రుని ఉపరితలాన్ని రసాయనిక, ఖనిజ, భౌగోళికంగా మ్యాప్ చేయడంలో విజయవంతమైంది. ఆ తర్వాత చంద్రయాన్-2 ను 2019లో ప్రయోగించినప్పటికీ చివరి దశలో కొన్ని సాంకేతిక లోపాల కారణంగా కక్ష్యలోనే మిగిలిపోయింది. అయితే, అందులోని ఆర్బిటర్ ఇప్పటికీ అధునాతన చిత్రాలను భూమికి పంపుతూనే ఉంది.
ఇస్రో ప్రణాళికలు.. లక్ష్యాలు
ఇస్రో తన భవిష్యత్తు ప్రణాళికల్లో 2027 నాటికి చంద్రయాన్-4 ను ప్రయోగించి, చంద్రుని ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి భూమికి తిరిగి తీసుకురావాలని భావిస్తోంది. అంతేకాకుండా, 2035 నాటికి భారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని 44 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్-5, చంద్రయాన్-6 తో పాటు మరిన్ని ప్రయోగాలను చేపట్టేలా సిద్ధమవుతోంది. ఇందులో గగనయాన్ మిషన్, శుక్రయాన్ మిషన్, భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, 2045 నాటికి భారతీయుడిని చంద్రునిపై పంపే లక్ష్యం కూడా ఉన్నాయి.
Chandrayaan 5 mission : ఓ కీలక మైలురాయి
చంద్రయాన్-5 మిషన్ భారత అంతరిక్ష పరిశోధనలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మిషన్ ద్వారా చంద్రునిపై మరింత ఆధునిక పరిశోధనలు జరపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం అంతరిక్ష పరిశోధనలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతున్నప్పటికీ రాబోయే కాలంలో మరిన్ని అత్యాధునిక ప్రయోగాలు చేపట్టే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
అంతరిక్ష పరిశోధనలో మరో గొప్ప ఘనత
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ((Indian Space Research Organization) ఒక్కో మిషన్‌తో చరిత్ర సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. చంద్రయాన్-5 ప్రయోగం (Chandrayaan 5 mission) విజయవంతమైతే భారత అంతరిక్ష పరిశోధనలో మరో గొప్ప ఘనతగా నిలుస్తుంది. భవిష్యత్తులో భారత్ అంతరిక్ష రంగంలో మరిన్ని విజయాలను సాధిస్తుందనే నమ్మకం అంతరిక్ష నిపుణుల్లో ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..