South Central Railway Special Trains | తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని నగరాలు, పట్టణాల నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రజల కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 4 నుంచి 25వ తేదీ వరకు నడుస్తాయని తెలిపారు.
ప్రత్యేక రైళ్లు నడిచే రూట్లు ఇవే..
సికింద్రాబాద్-తిరుపతి రూట్
- సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు సికింద్రాబాద్ -తిరుపతి మధ్య 4 ప్రత్యేక సర్వీసులు
- సెప్టెంబర్ 5 నుంచి 26 వరకు తిరుపతి -సికింద్రాబాద్ మధ్య 4 ప్రత్యేక సర్వీసులు
కాచిగూడ – నాగర్‌సోల్ రూట్
- సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు కాచిగూడ -నాగర్‌సోల్ మధ్య 4 ప్రత్యేక సర్వీసులు
- సెప్టెంబర్ 5 నుంచి 26 వరకు నాగర్‌సోల్ – కాచిగూడ మధ్య 4 ప్రత్యేక సర్వీసులు
సంత్రాగ్జి-చర్లపల్లి రూట్
- సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 3 వరకు సంత్రాగ్జి – చర్లపల్లి మధ్య 3 ప్రత్యేక సర్వీసులు
- సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4 వరకు చర్లపల్లి – సంత్రాగ్జి మధ్య 3 ప్రత్యేక సర్వీసులు
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.