Secunderabad : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పలు కీలక మార్గాల్లో తాత్కాలికంగా ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
Secunderabad -ఆర్సీకేరే (07079/ 07080) ప్రత్యేక రైలు ఈనెల 13 నుంచి ఆగస్టు 31 వరకు ప్రతీ ఆదివారం సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 14 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అర్పికేరేలో బయ లుచేరి మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
హైదరాబాద్-అర్సికెరే (07060/07010)
హైదరాబాద్-అర్సీకేరీ (07060/07010) స్పెషల్ ట్రైన్ ఈ నెల 8 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 7.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45కు చేరుకుం టుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8వ తేదీ నుంచి ఆగస్టు 27 వరకు ప్రతి బుధవారం మధ్యాహ్నం 2గంటలకు అర్సికేరీ నుంచి బయ లుచేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
కాచిగూడ – తిరుపతి (07676):
ఈ రైలు జూలై 8వ తేదీ రాత్రి 11.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రద్దీ సమయంలో ప్రయాణికులకు ఎంతో ఊరట కలిగించనున్నాయి. సీట్లు పరిమితంగా ఉండటంతో ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే శాఖ అధికారులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.