Srisailam Canal roof collapsed : తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం డొమలపెంట సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీశైలం ఎడమ కాలువ (Srisailam Left Bank Canal-SLBC) టన్నెల్‌లో ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్ పైభాగం మూడు మీటర్ల మేర కూలిపోవడంతో సుమారు ఆరుగురు కార్మికులు ఆ శిథిలాల మధ్య చిక్కుకున్నారని తెలుస్తోంది.
నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన Srisailam Canal roof పనులు
ఈ ప్రమాదం ఎడమ కాలువ టన్నెల్ 14వ కిలోమీటరులో జరిగింది. చాలా రోజుల విరామం తర్వాత నాలుగు రోజుల క్రితమే ఇక్కడ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో అనేక మంది కార్మికులు పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. కొంత మంది కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడగా ఆరుగురు టెన్నల్ శిథిలాల మధ్య చిక్కున్నారని తెలుస్తోంది. గాయపడిన కార్మికులను ప్రాజెక్ట్ సైట్ మేనేజ్‌మెంట్ బృందం సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. మిగతా కార్మికులను బయటికి తీసేందుకు రక్షణ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. టన్నెల్ కూలిపోయడానికి కారణాలను తెలుసుకోవడానికి అధికారులు సమగ్ర విచారణ ప్రారంభించారు.
నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు
టన్నెల్ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించడానికి ముందు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సురక్షితతకు సంబంధించిన ప్రమాణాలను పాటించారా.. పనులు ప్రారంభించే ముందు టన్నెల్ స్థిరత్వాన్ని పరిశీలించారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాణ్యత లేని మెటీరియల్‌ను నిర్మాణంలో ఉపయోగించారా? టన్నెల్ పైభాగాన్ని సరైన రీతిలోనే కడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముమ్మరంగా రక్షణ చర్యలు.. శ్రమిస్తున్న బృందాలు
టన్నెల్ (Srisailam Canal) లో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాలను తొలగించేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. ఈ రక్షణ చర్యల్లో అగ్నమామపక, పోలీస్ శాఖలు, ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) టీములు కూడా పాల్గొంటున్నాయి. క్రేన్లు, డ్రిల్లింగ్ మెషిన్లు, ప్రత్యేక లైట్ సెటప్‌లతో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








