Stock Market : దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు ఈ రోజు స్థిరంగా ప్రారంభమయ్యాయి. నిఫ్టీపై PSU బ్యాంక్, ఫార్మా, FMCG, రియాల్టీ, మీడియా, ఎనర్జీ, మెటల్ రంగాల్లో అమ్మకాలు కనిపించాయి. ఉదయం 9.31 గంటలకు సెన్సెక్స్ 65.75 పాయింట్లు లేదా 0.08 శాతం పెరిగి 78,573.16 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 23.15 పాయింట్లు లేదా 0.10 శాతం పెరిగి 23,766.05 వద్ద ఉంది.
సానుకూలంగా మార్కెట్ ధోరణి
మార్కెట్ ధోరణి సానుకూలంగా ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) లో 1,366 స్టాక్స్ గ్రీన్‌లో ఉండగా, 529 స్టాక్స్ రెడ్‌లో ఉన్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో Q3 కార్పొరేట్ ఆదాయాలు గణనీయంగా పుంజుకోవడం సాధ్యం కాకపోవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారరరు. ఇది పెట్టుబడిదారులు మందగమనాన్ని అధిగమించే విభాగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తుందని అంటున్నారు.
సెక్టార్ల ప్రదర్శన
నిఫ్టీ బ్యాంక్ 21 పాయింట్లు లేదా 0.04 శాతం పెరిగి 51,081.60 వద్ద ఉంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 20.45 పాయింట్లు లేదా 0.04 శాతం పెరిగి 57,471.35 వద్ద ఉంది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 2.15 పాయింట్లు లేదా 0.01 శాతం పెరిగి 18,961.95 వద్ద ఉంది. నిఫ్టీపై ఆటో, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాల్లో కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి.
సెన్సెక్స్ ప్యాక్‌లో టాప్ గైనర్స్
Stock Market Sensex : సెన్సెక్స్ ప్యాక్‌లో బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, ఎం & ఎం, ఇన్ఫోసిస్, జొమాటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ICICI బ్యాంక్ ప్రధాన లాభదారులుగా నిలిచాయి. మరోవైపు నష్టపోయిన వాటిలో NTPC, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, ITC, టెక్ మహీంద్రా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు
తాజా ట్రేడింగ్ సెషన్‌లో డౌ జోన్స్ 0.07 శాతం తగ్గి 42,544.22 వద్ద ముగిసింది. S&P 500 0.43 శాతం తగ్గి 5,881.60 వద్ద ఉండగా, నాస్‌డాక్ 0.90 శాతం తగ్గి 19,310.79 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో, జకార్తా గ్రీన్‌లో ట్రేడవుతుండగా, హాంగ్‌కాంగ్, చైనా, బ్యాంకాక్, సియోల్ రెడ్‌లో ట్రేడవుతున్నాయి.
FIIs వ్యూహం.. DII మద్దతు
డాలర్ బలంగా ఉండటం, US బాండ్ యీల్డ్స్ ఆకర్షణీయంగా ఉండట వల్ల FIIs తమ అమ్మకాల వ్యూహాన్ని కొనసాగించే అవకాశం ఉంది. మార్కట్ నిపుణులు ఈ మేరకు అంచనా వేస్తున్నారు.
డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (DII) కొనుగోళ్లు తక్కువ స్థాయిల వద్ద మార్కెట్‌ను మద్దతు ఇవ్వగలవు కానీ ఇది మార్కెట్‌ను గణనీయంగా పైకి తీసుకెళ్లడానికి సరిపోదని అంటున్నారు. అధిక స్థాయిల వృద్ధి , ఆదాయ పుంజుకొనడం కోసం వేచిచూడాల్సి ఉంటుందని తెలిపారు.
రూ. 1,782.71 కోట్ల ఈక్విటీలు
FIIs జనవరి 1న రూ. 1,782.71 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. డొమెస్టిక్ ఇన్వెస్టర్లు రూ. 1,690.37 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..