Students lock school : ఓ ఉపాధ్యాయుడిపై విద్యార్థులు తిరగబడ్డారు. విద్యా బుద్ధులు నేర్పించి తమను సన్మార్గంలో పెట్టాల్సిన ఆయనే అనైతిక కార్యకలాపాలకు ప్రేరేపించడాన్ని సహించలేకపోయారు. ఆ టీచర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ (demanding the suspension) చేస్తూ పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి తల్లిదండ్రులతో కలిసి నిరసనకు దిగారు. పెద్దపల్లి జిల్లా (Peddapalli) నిట్టూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ( Government High School) వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
ఉపాధ్యాయుడి తీరు.. విద్యార్థుల బేజారు
విద్యార్థుల ఆరోపణల ప్రకారం.. నిట్టూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలోని ఓ ఉపాధ్యాయుడు తన సహచర ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలిగిస్తూ పాఠశాలలో అనవసర గందరగోళం సృష్టిస్తున్నాడు. విద్యార్థులకు డబ్బు ఇచ్చి, ఇతర ఉపాధ్యాయులపై తప్పుడు ఆరోపణలు చేయమని (spread wrong propaganda against other teachers) ఒత్తిడి తెస్తున్నాడు. ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులను కులం పేరుతో దూషిస్తున్నారని ప్రచారం చేయమని విద్యార్థులను ప్రేరేపిస్తున్నాడు. దీనిపై విసిగి వేసారిపోయిన విద్యార్థులు చివరికి ఆయనపై నిరసన గళమెత్తారు. ఇలాంటి టీచర్ తమకు వద్దని, ఆయనను సస్పెండ్ చేయాలని నినదిస్తూ పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి ఆందోళనకు (protest)కు దిగారు.
స్పందించిన అధికారులు
ఈ నిరసనపై అధికారులు స్పందించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో చర్చలు జరిపారు. ఈ సమస్యను పరిశీలిస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఆ ఉపాధ్యాయుడి (teacher)పై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
మండిపడుతున్న విద్యావేత్తలు
ఈ రకమైన సమస్యలు విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒక ఉపాధ్యాయుడు తప్పు చేసినా, అది మొత్తం పాఠశాల వాతావరణాన్ని కలుషితం చేస్తుందని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని మండిపడుతున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








