Tension in OU : ఉస్మానియా యూనివర్శిటీ (Osmania University campus) ఈ రోజు ఉద్రిక్తత నెలకొంది. క్యాంపస్ (campus)లో నిరసనలు, ఆందోళనలు నిర్వహించకూడదంటూ యూనివర్శిటీ అధికారులు విడుదల చేసిన సర్క్యులర్‌పై విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ఉత్తర్వులకు నిరసనగా వర్సిటీ బంద్(bandh)కు పిలుపునివ్వడంతోపాటు ఆందోళన చేపట్టగా పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిరసన తెలుపుతున్న విద్యార్థుల(students)ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.
Tension in OU : జాక్ నేతల ముందస్తు అరెస్టు
యూనివర్శిటీ సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించాయి. ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా బయల్దేరాలనుకున్న విద్యార్థి సంఘాల నాయకులను కూడా పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) నేతలు నిరసన తెలుపుతున్న సమయంలోనే పోలీసులు వారిని అరెస్టు (arrested) చేశారు.
విద్యార్థులను బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు
అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP)కి చెందిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఆర్ట్స్ కాలేజీ భవనంలో నుంచి బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. ఈ ఘటన యూనివర్శిటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసుల తీరుపై విద్యార్థులు భగ్గుమన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న (fighting for democratic rights ) తమపై వర్సిటీ అధికారులు ఆంక్షలు విధించడమే కాకుండా పోలీసుల ద్వారా అరాచకం సృష్టించడం దారుణమని మండిపడ్డారు.
ఉద్యమాన్ని అణచలేరు : ఏబీవీపీ
ఈ ఘటనపై ABVP జాతీయ కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ యూనివర్శిటీల కోఆర్డినేటర్ జీవన్ మాట్లాడుతూ పోలీసులు విద్యార్థులను అరెస్టు చేయడం ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఎన్ని ఆంక్షలు విధించినా విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారని స్పష్టం చేశారు. యూనివర్శిటీ సర్క్యులర్‌ను 24 గంటల్లో వెనక్కి తీసుకోకపోతే విద్యార్థుల పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








