Sarkar Live

మరో సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్

వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం (RO) లో అవినీతి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇటీవలే జాయింట్-2 సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ సస్పెండ్ కాగా, తాజాగా జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ రాంనర్సింహారావుపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ​ఈ నెల 3వ తేదీన ఏసీబీ అధికారులు

వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం (RO) లో అవినీతి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇటీవలే జాయింట్-2 సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ సస్పెండ్ కాగా, తాజాగా జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ రాంనర్సింహారావుపై కూడా సస్పెన్షన్ వేటు పడింది.

​ఈ నెల 3వ తేదీన ఏసీబీ అధికారులు వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై మెరుపు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో వెలుగుచూసిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిన డీఐజీ సుభాషిణి, రాంనర్సింహారావుపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా కమిషనర్ రాజీవ్ గాంధీ హన్మంతు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.వాస్తవానికి ఈ నెల 10వ తేదీనే సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి.కానీ శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నేడు సోమవారం కార్యాలయం పునఃప్రారంభం కావడంతో, సస్పెన్షన్ కాపీలు అధికారికంగా కార్యాలయానికి చేరనున్నాయి.

​వరుసగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ కావడంతో రిజిస్ట్రేషన్ శాఖలో కలకలం రేగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?