Sarkar Live

Supreme Court | మేమిప్పుడెందుకు జోక్యం చేసుకోవాలి?.. సుప్రీం కోర్టు కీల‌క వ్యాఖ్య‌

Supreme Court : దేశ రాజకీయం, న్యాయ వ్యవస్థ మధ్య కాంట్ర‌వ‌ర్సీ మరోసారి చర్చనీయాంశ‌మైంది. తాజా సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice B.R. Gavai) ఈ రోజు చేసిన కీల‌క‌ వ్యాఖ్యలు (Key Comments) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వెస్ట్‌

Supreme Court

Supreme Court : దేశ రాజకీయం, న్యాయ వ్యవస్థ మధ్య కాంట్ర‌వ‌ర్సీ మరోసారి చర్చనీయాంశ‌మైంది. తాజా సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice B.R. Gavai) ఈ రోజు చేసిన కీల‌క‌ వ్యాఖ్యలు (Key Comments) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వెస్ట్‌ బెంగాల్‌లో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథంలో అక్కడ రాష్ట్రపతి పాలన (President’s Rule) విధించాలంటూ ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖ‌లైంది. ఆ సమయంలో బెంచ్‌లో ఉన్న జస్టిస్ గవాయ్ దీనిపై స్పందిస్తూ ‘ఇప్పటికే మాపై కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామ‌నే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మ‌ళ్లీ ఇప్పుడు రాష్ట్రపతిని ఆదేశించమంటారా? ‘ అని వ్యాఖ్యానించారు.

జ‌స్టిస్ వ్యాఖ్యల వెనుక ఉన్న నేపథ్యం ఏమిటి?

ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) ఓ కీలక తీర్పులో శాసన సభల ద్వారా రెండుసార్లు ఆమోదం పొందిన బిల్లులను రాష్ట్రాల గవర్నర్లు (Governors), రాష్ట్రపతి (President) నిర్ణీత గడువులో ఆమోదించాల్సిందిగా సూచించింది. కొన్ని రాష్ట్రాల్లో బిల్లులను గవర్నర్లు లేదా రాష్ట్రపతి వెంట‌నే ఆమోదించ‌డాన్ని సుప్రీం తప్పుబట్టింది. ప్రజాస్వామ్యంలో ఇది సరికాదని చెప్పింది. ఈ తీర్పుపై భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌ (Vice President Jagdeep Dhankhar), బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (BJP MP Nishikant Dubey), ఆ పార్టీ ఇతర నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధుల్లో న్యాయ వ్యవస్థ ( judiciary) జోక్యం చేసుకుంటోంద‌ని ( judiciary) విమ‌ర్శించారు.

ఉప రాష్ట్రప‌తి ఏమ‌న్నారంటే..

దీనిపై సుప్రీం కోర్టు (Supreme Court) పై ధ‌న్‌ఖ‌ర్ (Vice President Jagdeep Dhankhar) తీవ్రంగా స్పందించారు. న్యాయ వ్యవస్థ రాష్ట్రపతికి గడువులు విధించ‌డ‌మంటే అది ఒక రకమైన ప్రజాస్వామ్యంపై దాడి అని వ్యాఖ్యానించారు. నియమితమైన హద్దులను దాటి, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల పనుల్లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటోందని అభిప్రాయప‌డ్డారు. ఇప్పుడు జడ్జిలే శాసనాలు చేస్తున్నారు, వాళ్లే కార్యనిర్వాహక చర్యలు చేపడుతున్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నిషికాంత్ దూబే వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మరో అడుగు ముందుకెళ్లి మాట్లాడుతూ ‘ఒకవేళ సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే, ఇక పార్లమెంటును మూసేయాల్సిందే ‘ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. ప్రతిపక్షాలు వీటిని తీవ్రంగా ఖండించాయి. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతను అవమానించడం అంటూ విమర్శించాయి.

Supreme Court ప్ర‌తిస్పందన.. పరోక్ష వ్యాఖ్యలు

ఈ క్ర‌మంలోనే ప‌శ్చిమ బెంగాల్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌ను విధించాల‌ని పిటిషన్ దాఖ‌లు కాగా విచారణ సమయంలో జస్టిస్ గవాయ్ పేర్కొన్న మాటలు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ‘ఇప్పటికే మాపై నిందలు వస్తున్నాయి.. మేము పాలక వ్యవస్థల్లో జోక్యం చేస్తున్నామని. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మమ్మ‌ల‌నే రాష్ట్రపతిని ఆదేశించమంటారా? ‘ అది ఎంతవరకు సమంజసం? ప‌రోక్షంగా ఉప రాష్ట్ర‌ప‌తి, బీజేపీ నేత‌ల కామెంట్ల‌పై జ‌స్టిస్ గ‌వాయ్ స్పందించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!