Oscar Nominations : తమిళ్ స్టార్ సూర్య (Tamil Star Surya)ప్రతీ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. తమిళనాడులో అతడి సినిమా రిలీజ్ రోజు ఎంత క్రేజ్ ఉంటుందో… తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే క్రేజ్ ఉంటుంది. అక్కడ సూర్యని ఎలా ఆరాధిస్తారో ఇక్కడ కూడా అలా ఆరాధించేవారు ఉన్నారు.
Tamil Star Surya నటించిన గజిని, యముడు, యముడు -2, సింగం-3, ఆకాశమే హద్దురా సినిమాలు తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఈ సినిమాలు కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని సాధించాయి. అలాగే టాలీవుడ్ లో సూర్య మార్కెట్ ని మరింతగా పెంచాయి.
రీసెంట్ గా శివ (Shiva)డైరెక్షన్లో కంగువా (kanguva)మూవీలో సూర్య నటించారు. 2024 నవంబర్లో పాన్ ఇండియా మూవీ గా విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. వెయ్యిళ్ల కిందటి కథగా వచ్చిన ఈ సినిమాలో సూర్య నటన మెప్పించినా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
విజువల్స్, సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించినా అర్థం కాని స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) పాటలు ఓకే అనిపించినా బీజీఎంతో మాత్రం మ్యాజిక్ చేయలేకపోయాడనే విమర్శలు కూడా వచ్చాయి. అన్ని విషయాల్లో వెనుకబడిన ఈ మూవీని ప్రేక్షకులు డిజాస్టర్ గా తేల్చేశారు.
అయితే ఈ మూవీ ఇప్పుడు అనూహ్యంగా ఆస్కార్ బరిలో నిలిచింది. ఒక డిజాస్టర్ మూవీ ఆస్కార్ (Oscar Nominations ) బరిలో నిలవడం అంటే గొప్పనే చెప్పుకోవాలి. మరో రెండు నెలల్లో ఆస్కార్ వేడుక జరగనుండగా ఈ పిరియాడి క్ యాక్షన్ మూవీ ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ అయింది.
ఇదిలా ఉండగా యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్, బ్యానర్స్ పై జ్ఞానవేల్ రాజా, వంశీ ప్రమోద్ నిర్మించిన ఈ మూవీ లో సూర్య సరసన దిశా పటా నీ హీరోయిన్ గా నటించారు. బాబీ డియోల్ విలన్ పాత్రలో అలరించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
1 Comment
[…] ప్రచారం జరుగుతూనే ఉంది.ఓ సందర్భంలో సూర్య కూడా గజినీ-2 మూవీ ఉంటుందని హింట్ […]