Suryapet news | సూర్యాపేటలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను హత్య చేయడానికి దుండగులు కారులో వెంబడించారు. ఈ సంఘటన సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని బీబీగూడెం సమీపంలోని ఓ వైన్స్ ముందు తీవ్ర భయాందోళనలు సృష్టించింది. వివరాల్లోకి వెళితే సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి శుక్రవారం బైక్ పై వెళ్తున్న ముగ్గురిని (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) గుర్తుతెలియని వ్యక్తులు కారులో వెంబడించగా బీబీ గూడెం సమీపంలో ఉన్న ఓ వైన్స్ షాపు ముందు బైక్ బయటపడవేసి ఆందోళనతో వైన్స్ లోపలికి వెళ్లారు. బైక్ ను వెంబడిస్తూ వస్తున్న దుండగులు కారు నుంచి దిగి ఆ ముగ్గురిని చంపడానికి కత్తులు, కర్రలతో వైన్స్ వైపు పరుగెత్తారు. ఈ క్రమంలో వైన్స్ షాప్ లో ఉన్న వారు ఒక్కసారిగా బయటికి రావడంతో వారిని చూసి కారెక్కి పారిపోయారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.