వరంగల్‌లో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు నిందితులను సిసిఎస్ మరియు హన్మకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
నిందితులు: కళ్యాణ సుందరం (30), సెల్వరాజ్ (28). (మధురై, తమిళనాడు).
స్వాధీనం చేసుకున్న సొత్తు..
95 గ్రాముల బంగారు ఆభరణాలు (విలువ 15.20 లక్షల రూపాయలు).
ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు.
కేసులు: వరంగల్, హన్మకొండ, సుబేదారి, కెయుసి మరియు కర్నూల్లో కలిపి మొత్తం 5 చైన్ స్నాచింగ్‌లు.
చోరీల తీరు..
జల్సాలకు అలవాటు పడి, గంజాయి మత్తులో సులభంగా డబ్బు సంపాదించాలని ఈ ముఠా నిర్ణయించుకుంది. వీరు ముందుగా ఒక బైక్‌ను దొంగిలించి, దానిపై తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసులను తెంచుకెళ్లేవారు. ఆధునిక టెక్నాలజీ సాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు, వారు మళ్ళీ దొంగతనానికి వరంగల్ వచ్చిన సమయంలో పక్కా ప్లాన్‌తో పట్టుకున్నారు.
కమిషనర్ అభినందనలు
టెక్నాలజీని వాడుతూ నిందితులను పట్టుకొని చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అడిషనల్ క్రైమ్ డీసీపీ జి.బాల స్వామి, క్రైమ్ ఏసీపీ పి సదయ్య, హన్మకొండ ఏసీపీ పి.నర్సింహరావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ లు ఏ . రాఘవేందర్, కె .రామకృష్ణ , హన్మకొండ ఇన్స్పెక్టర్ శివ కుమార్ , సుబేదారీ ఇన్స్పెక్టర్ రంజిత్,హన్మకొండ ఎస్. ఐ కిశోర్, ఏఏ ఓ సల్మాన్ పాషా, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్లు మహేశ్, జంపయ్య, కానిస్టేబుల్లు మధుకర్, చంద్రశేఖర్, హన్మంతు, ఐ టీ కోర్ కానిస్టేబుల్ నగేష్, కెయుసి మరియు హన్మకొండ క్రైమ్ కానిస్టేబుళ్లు జితేందర్, రమణలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు.
జాగ్రత్త: ఒంటరిగా వెళ్లే మహిళలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు








