Vodafone Idea | భారతదేశంలోని మూడవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన వొడాఫోన్ ఐడియా ఇటీవలి కాలంలో వినియోగదారులను కోల్పోతూ వస్తోంది. ప్రతి నెలా, వందల వేల మంది కస్టమర్‌లు విడిచివెళ్లిపోతున్నారు. తక్కువ నెట్‌వర్క్ కవరేజ్, కనెక్టివిటీ సమస్యల కారణంగా తరచుగా ఇతర ప్రొవైడర్‌లకు మారుతున్నారు. మరోవైపు టారీఫ్ ప్లాన్ల ధరలు పెంచడంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, వినియోగదారులకు ఊరట కలిగించేలా వొడఫోన్ ఐడియా ఓ గుడ్ న్యూస్ చెప్పంది. ఈ టెలికాం కంపెనీ ఇటీవల తన నెట్‌వర్క్ కవరేజీని మెరుగుపరిచింది. ఈ విషయంలో Jio Airtel రెండింటినీ అధిగమించింది.
Vi 4G కవరేజ్
4G నెట్‌వర్క్ నాణ్యత పరంగా, వోడాఫోన్ ఐడియా తమ వినియోగదారులకు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రతి గంటకు 100 మొబైల్ టవర్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఓపెన్ సిగ్నల్ ఇటీవలి నివేదిక ప్రకారం, 4G కవరేజ్ విషయానికి వస్తే, Vodafone Idea ఇప్పుడు భారతదేశంలోని అన్ని టెలికాం కంపెనీల కంటే మురుగ్గా ఉంది. జూన్ నుంచి నవంబర్ 2024 వరకు నిర్వహించిన సర్వే ఆధారంగా, వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, వాయిస్ కాల్స్, డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగం రెండింటితో సహా ఆరు ముఖ్యమైన రంగాలలో వోడాఫోన్ ఐడియా మిగతా టెలికాం కంపెనీల కంటే ముందుందని నివేదిక వెల్లడించింది.
ప్రత్యేకంగా, Vodafone Idea సగటు 4G డౌన్‌లోడ్ వేగం 17.4 Mbps, ఇది Airtel కంటే 8 శాతం, Jio కంటే 22 శాతం వేగంగా ఉంది. దీనర్థం వోడాఫోన్ నెట్‌వర్క్‌లోని వినియోగదారులు ఆన్‌లైన్‌లో వీడియోలను చూడటం, కంటెంట్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు మెరుగైన ఎక్స్ పీరియన్స్ ను పొందుతున్నారు.
Also Read : అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు..
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                     
        
1 Comment
[…] అనుకూలమైన రీచార్జ్‌గా చెప్పవచ్చు. Jio, Airtel, Vodafone Idea వంటి ప్రైవేట్ ఆపరేటర్ల […]