Teenmar Mallanna New Party : తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని ఈరోజు స్థాపించారు. తన పార్టీకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (Telangana Rajyadhikara Party -TRP) పేరు పెట్టారు. బుధవారం హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో తన కొత్త పార్టీ వివరాలను తీన్మార్ మల్లన్న వెల్లడించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జెండా మధ్యలో కార్మిక చక్రం, పిడికిలి బిగించిన చేయి, దాని చుట్టూ ఆలీవ్ ఆకులు ఉన్నాయి. జెండాపై ‘ఆత్మగౌరవం, అధికారం, వాటా’ అని రాసి ఉంది.
బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపిస్తున్నట్లు తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) ఈసందర్భంగా తెలిపారు. ‘తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు. బీసీల ఆత్మగౌరవ జెండా రేపటి నుంచి రెపరెపలాడబోతోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను పరిచయం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    