వరంగల్ : ములుగు జిల్లా (Mulugu District) లోని జిల్లా ప్రజా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాదెగోని సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సానికొన్ను సౌమ్యను తెలంగాణ ACB అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారుడి వైద్య సెలవు కోసం జీత బిల్లులను సిద్ధం చేయడానికి, ములుగు జిల్లా ట్రెజరీ కార్యాలయానికి సమర్పించడానికి అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.25,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కగా వలపన్ని అవినీతికి పాల్పడిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధాకర్ ను అలాగే జూనియర్ అసిస్టెంట్ సౌమ్యను పట్టుకున్నారు.
ఇదిలా ఉండగా సోమవారం వికారాబాద్ (Vikarabad) జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ – టి. శ్రీధర్ ను ACB అధికారులు అదుపులోకి తీసుకున్నారు. , “ఫిర్యాదిదారుడి టి.ఎ. బిల్లును ప్రాసెస్ చేయడానికి ఫిర్యాదుదారుడి నుండి రూ.8,000/- లంచం తీసుకున్నాడు. దీంతో తెలంగాణ ACB అధికారులు అతడిని పట్టుకున్నారు.
ACB అధికారులకు ఇలా ఫిర్యాదు చేయొచ్చు..
కాగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినపుడు చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి మీరు ACB తెలంగాణ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని ఏసీబి అధికారులు కోరారు. ఫిర్యాదుల కోసం WhatsApp (9440446106), Facebook (తెలంగాణ ACB), వెబ్‌సైట్ ద్వారా కూడా సంప్రదించవచ్చు:( https://acb.telangana.gov.in ) ఫిర్యాదుదారు / బాధితుడి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








