ACB Raids in Telangana | ఏసీబీ అధికారులు అక్రమార్కల భరతం పడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే ముగ్గురు లంచావతారులను పట్టుకున్న ఏసీబీ (Telangana ACB) తాజాగా శనివారం మరో ఇద్దరు అవినీతి అధికారులను అరెస్టు చేసింది.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాండ్ బాజా నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై కొన్ని రోజుల క్రితం జగద్గిరిగుట్ట పీఎస్ లో సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద ఎస్సై శంకర్ కేసు నమోదు చేశాడు. అయితే ఎస్ఐ కె.శంకర్ ఫిర్యాదుదారుడి వాహనం, DJ సిస్టమ్ ను తిరిగి ఇచ్చేందుకు గాను ఫిర్యాదుదారుడి నుంచి ₹15,000/- లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
అయితే కేసు నమోదు తర్వాత డీజేకు సంబంధించిన సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన సామగ్రిని తిరిగి ఇచ్చేందుకు గాను కేసు నమోదైన వ్యక్తి నుంచి ఎస్సై శంకర్ రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈక్రమంలో స్టేషన్ లో లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు పక్కాగా వలపన్ని పట్టుకున్నారు. ఎస్సై శంకర్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు జగద్గిరిగుట్ట పీఎస్ లో విచారిస్తున్నారు.
ACB Raids : నిర్మల్ జిల్లాలో..
మరో ఘటనలో నిర్మల్ జిల్లాలో పట్టా మార్పిడి కోసం లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులకు అవినీతి ఆఫీసర్ అడ్డంగా దొరికాడు. శనివారం నిర్మల్ జిల్లాలోని కడెం తహసీల్దార్ కార్యాలయంలోఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ సర్వేయర్ పవార్ ఓమాజీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
పట్టామార్పిడి కోసం రైతు ప్రభాకర్ నుంచి సర్వేయర్ రూ. 20వేలు లంచం డిమాండ్ చేశాడు. అయితే అంత ఇచ్చుకోలేనని చివరకు రూ.7వేలకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా సర్వేయర్ పవార్ ఓమాజీని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
ఒకేరోజు ముగ్గురు అధికారుల అరెస్టు
రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో లంచాలు తీసుకుంటూ ముగ్గురు అధికారులు శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే.. వీరిలో ఒకరు జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ జోనల్ టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) కాగా.. మరొకరు కామారెడ్డి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇంకొకరు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఇన్‌ఛార్జి ఎంపీడీవో ఉన్నారు.
ఇలా ఫిర్యాదు చేయండి..
ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయవచ్చు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలు అయిన “వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశాను సంప్రదించవచ్చును. “ఫిర్యాదుధారుల / బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








