Telangana Assembly : తెలంగాణ శాసనసభలో ఈ రోజు జరిగిన సమావేశాలు తీవ్ర చర్చలకు వేదిక అయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ చర్చ చివరి దశకు చేరుకోగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం రగిలింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KT Rama Rao) చేసిన వ్యాఖ్యలు సభ (Telangana Assembly)లో దుమారం రేపాయి.
కీలకాంశాలపై చర్చ జరుగుతుండగా..
సభలో ప్రధానంగా పలు అంశాలపై చర్చ జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరం సాధారణ పరిపాలన, న్యాయ, హోం, ఆర్థిక, ఇంధన, రెవెన్యూ, గృహనిర్మాణం, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మంగళవారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అదనపు వ్యయ అంచనాలను ప్రవేశపెట్టగా వీటి మొత్తాన్ని రూ.50,471 కోట్లుగా ప్రకటించారు. పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణలపై శాసనమండలిలో చర్చ జరగనుంది. అవయవదానం సంబంధిత తీర్మానాన్ని కూడా ప్రభుత్వం మండలిలో ప్రవేశపెట్టనుంది. అయితే, సభలో చోటుచేసుకున్న ముఖ్య అంశాల్లో కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రధానంగా నిలిచాయి.
Telangana Assembly : కాంగ్రెస్, బీఆర్ఎస్ వాగ్యుద్ధం
బడ్జెట్ డిమాండ్లపై చర్చ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Government Whip Adi Srinivas) మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని (violated Assembly rules) ఆరోపించారు. లాబీల్లో, అసెంబ్లీ ప్రవేశద్వారం (Assembly lobbies and entrance)లో ఆందోళన చేపట్టడం నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాల కారణంగా విపక్షంలోకి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సభలో నాటకాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో 16 సంవత్సరాలుగా మల్లు భట్టి విక్రమార్క (Deputy Chief Minister Mallu Bhatti Vikramarka)తో తనకు అనుబంధాన్ని గుర్తు చేశారు. భట్టి విక్రమార్కను గౌరవిస్తానని, కానీ ఆది శ్రీనివాస్ తనకు సంబంధించిన విషయాలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
సీఎంపై కేటీఆర్ వ్యాఖ్యలు
తనకూ విమర్శించగల సామర్థ్యం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కావాలంటే సీఎం రేవంత్ రెడ్డిని ‘ఓటుకు నోటు సీఎంసీ (Chief Minister a ‘Vote-for-Note CM’) అని పిలవచ్చు లేదా ఇదొక 20%-30% కమిషన్ ప్రభుత్వం అని చెప్పొచ్చు అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన ఆరోపణలను ఉదహరించారు. ముఖ్యమంత్రి పదవి పొందడానికి 50 కోట్లు ఖర్చు చేశారని కాంగ్రెస్ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Komatireddy Venkat Reddy) గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అయితే, కేటీఆర్ (KT Rama Rao) మాట్లాడుతున్న సమయంలోనే మైక్ ఆపేయడం బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLAs)ల ఆగ్రహానికి కారణమైంది.
Telangana Assembly : పక్కదారి పట్టిన బడ్జెట్ చర్చ
కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలడంతో కేటీఆర్ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు సభాపతి గడ్డం ప్రసాద్ Speaker Gaddam Prasad) ప్రకటించారు. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలూ తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో అసెంబ్లీలో బడ్జెట్ చర్చ కాస్త రాజకీయ విమర్శల వేదికగాఆ మారింది.
భగ్గుమన్న భట్టి విక్రమార్క
కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు పనులు కావాలంటే 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది అని వ్యాఖ్యానించారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka) సహా అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి విక్రమార్క హెచ్చరించారు. మిగతా కాంగ్రెస్ సభ్యులు కూడా కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేదంటే సభలో క్షమాపణ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలడంతో సభలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








