Sarkar Live

Telangana Assembly | అసెంబ్లీలో నిర‌స‌న‌ల ప‌ర్వం.. రుణ‌మాఫీపై బీఆర్ఎస్ నిల‌దీత‌

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. వార్షిక బడ్జెట్‌పై ఈ రోజు కూడా ప్ర‌తిప‌క్షాల నిర‌స‌న‌ల మ‌ధ్య చర్చ ప్రారంభ‌మైంది. మునిసిప‌ల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, పరిశ్రమలు, సమాచార సాంకేతికత శాఖలకు కేటాయింపుల‌పై చర్చ కొన‌సాగింది.

Telangana Assembly

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. వార్షిక బడ్జెట్‌పై ఈ రోజు కూడా ప్ర‌తిప‌క్షాల నిర‌స‌న‌ల మ‌ధ్య చర్చ ప్రారంభ‌మైంది. మునిసిప‌ల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, పరిశ్రమలు, సమాచార సాంకేతికత శాఖలకు కేటాయింపుల‌పై చర్చ కొన‌సాగింది. ముఖ్యంగా మునిసిపాలిటీల‌ స‌వ‌ర‌ణ బిల్లు (Municipalities Amendment Bill) లు, పంచాయ‌తీరాజ్ స‌వ‌ర‌ణ బిల్లుల (Panchayat Raj Amendment Bill) ను ఈ స‌మావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.

వాయిదా తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన కేటీఆర్‌, హ‌రీశ్‌రావు

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) గట్టిగా నినాదాలు చేస్తూ పంట రుణ మాఫీపై తక్షణమే చర్చ చేపట్టాలని కోరారు. వార్షిక బడ్జెట్‌పై చర్చను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మంత్రులు చేస్తుండ‌గానే నిర‌స‌న‌తో హోరెత్తించారు. రుణ మాఫీ అంశాన్ని ప్ర‌ధానంగా తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, తన్నీరు హరీశ్‌రావు (KT Rama Rao and T Harish Rao) మాట్లాడుతూ వ‌రంగ‌ల్ డిక్లరేషన్ (Warangal Farmers Declaration)లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రూ. 2 లక్షల వరకు పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టారు.

Telangana Assembly : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్‌

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తమ పక్షాన్ని సమర్థించుకుంటూ 2025-26 బడ్జెట్‌లో రైతులకు అనేక సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంట రుణ మాఫీ ప్రక్రియను ప్రారంభించిందని, త్వరలోనే రైతులకు పూర్తి మాఫీ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో సంతృప్తి చెందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

జ‌ర్న‌లిస్టుల‌ను ప‌ట్టించుకోండి: ఎమ్మెల్యే కూనంనేని

అసెంబ్లీ స‌మావేశాల్లో (Telangana Assembly) సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు ( CPI MLA Kunamneni Sambasiva Rao) మాట్లాడుతూ జ‌ర్న‌లిస్టుల (journalists) సంక్షేమాన్ని ప్ర‌భుత్వం విస్మ‌రించింద‌న్నారు. జ‌ర్న‌లిస్టుల‌కు భ‌ద్ర‌త‌, గృహ వ‌స‌తి, ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, పెన్ష‌న్ ప్ర‌యోజ‌నాలు త‌దిత‌ర సౌక‌ర్యాలు కల్పించాల‌ని వాయిదా తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?