Telangana Assembly Sessions : తెలంగాణ శాసన సభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 9న ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతాయి. అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. కాగా ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. సమావేశాల్లో పలు కీలక చట్టాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలు, కుల గణన, మూసి ప్రక్షాళన, నూతన ఆర్ఓఆర్ చట్టం, బీసీ రిజర్వేషన్ తోపాటుపలు కొత్త చట్టాలు అసెంబ్లీలో చర్చించనున్నట్లు సమాచారం.
కాగా సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో పాటు మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. అయితే , దీనికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం పలు అంశాలతో కూడిన నివేదికను రూపొందించినట్లు సమాచారం. ఈ అంశాలను అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా విషయంలో ముందుకు వెళ్లాలని రేవంత్ సర్కారు భావిస్తోంది.
ఇదిలా ఉండగా అసెంబ్లీ సమావేశాలకు బిఆర్ ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని సీఎం రేవంత్‌రెడ్డి వివిధ సందర్భాల్లో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కేసీఆర్ అడుగుపెడతారా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
1 Comment
[…] […]