Bonalu 2025 festival in Telangana | రాష్ట్రంలో బోనాల పండుగ సందడి మొదలైంది. ఈనెల 26 నుంచి హైదరాబాద్ గోల్కొండ బోనాలు ప్రారంభమవుతున్నాయి. కాగా ఈ సంవత్సరం హైదరాబాద్ నగరంలో బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వెల్లడించారు. ఈమేరకు బుధవారం ఆషాడ బోనాల నిర్వమణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. బోనాల పండుగ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు సురేఖ సూచించారు. ఇప్పటికే రూ. 20 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని సురేఖ వెల్లడించారు.
Telangana Bonalu 2025 : 26న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో ..
ఈనెల 26న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయం (Golconda Bonalu) లో ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. జూన్ 29న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం (Ujjaini Mahankali Bonalu)లో ఎదుర్కోలు, 13న రంగం( భవిష్యవాణి) నిర్వహిస్తామని తెలిపారు. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో కల్యాణం, పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం, జూలై 20న సింహ వాహిని మహంకాళి ఆలయం, మీరాళం మండి మహా కాలేశ్వర దేవాలయం, శాలిబండ అక్కన్న మాదన్న ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవస్థానం, కార్వాన్ సబ్జి మండి నల్ల పోచమ్మ దేవాలయం, బల్కంపేట్ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఆషాడ బోనాలను లు నిర్వహించనున్నామని తెలిపారు.
ప్రధాన దేవాలయాలకు పట్టువస్త్రాలు
రాష్ట్ర ప్రభుత్వం 28 ప్రధాన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తుందని అందులో దేవాలయాల్లో మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మిగతా 19 దేవాలయాల్లో ఈవోలు, దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఈనెల 26న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. జూన్ 29న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఎదుర్కోలు, 13న రంగం( భవిష్యవాణి) నిర్వహించడం జరుగుతుందని, జూలై 1న బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో కళ్యాణం, పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం, జూలై 20న
సింహ వాహిని మహంకాళి ఆలయం, మీరాళం మండి శ్రీ మహా కాలేశ్వర దేవాలయం, శాలిబండ శ్రీ అక్కన్న మాదన్న ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ దేవస్థానం, కార్వాన్ సబ్జి మండి శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం, బల్కంపేట్ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఆషాడ బోనాలను లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం 28 ప్రధాన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తుందని అందులో దేవాలయాల్లో మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మిగతా 19 దేవాలయాల్లో ఈవోలు, దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో సహా పలువురు మంత్రులు హాజరయ్యారు.
ముఖ్యమైన తేదీలు
- జూన్ 26: గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో ఉత్సవారంభం
- జూన్ 29: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎదుర్కోలు
- జులై 1: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కళ్యాణం, పట్టు వస్త్రాల సమర్పణ
- జులై 13: రంగం (భవిష్యవాణి) ఉత్సవం
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.