- ఉగాది నుంచి భూభారతి అమలు
- సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా మంత్రి వర్గ భేటీ
Telangana Cabinet meeting | తెలంగాణ రెవెన్యూ శాఖ బలోపేతానికి రేవంత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిది. ఇందు కోసం రాష్ట్రంలోని ప్రతి గ్రామానికొక క్షేత్రస్థాయిలో అధికారి ఉండేలా క్యాబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే కాకుండా కొత్తగా ఏర్పడిన డివిజన్లు, మండలాలకు సైతం కొత్తగా పోస్టులను మంజూరు చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు సైతం ఆమోద ముద్ర వేసింది.
హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది. విస్తరణ తర్వాత హెచ్ఎండిఎ పరిధిలో 11 జిల్లాలు 1355 గ్రామాలు 332 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నాయి. రాష్ట్రంలోని 10,950 గ్రామాలకు క్షేత్ర స్థాయి అధికారుల నియమానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కొత్త డివిజన్లు, మండలాలకు 217 పోస్టుల మంజూరు, 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు సైతం క్యాబినేట్ ఆమోదం తెలిపింది. అలాగే ఉగాది నుంచి భూభారతి చట్టం అమలు చేయాలని నిర్ణయించింది.
మెట్రో రైల్ ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళనతో సహా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ, యాదాద్రి టెంపుల్ బోర్డు, హెచ్ఎండిఎ యాక్ట్‌లో మార్పులకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మైనింగ్ యాక్ట్, ఎల్‌ఆర్‌ఎస్ అంశాలు కేబినెట్‌లో చర్చకు వచ్చింది.
కాగా కేబినెట్ నిర్ణయాల పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, ఇతర మంత్రులకు, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌కు కార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








