Telangana Dasara Holidays 2025 | తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ సంవత్సరం దసరా సెలవుల ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి? ఎన్ని రోజులు ఇస్తున్నారు? అని చాలా విద్యార్థులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో దసరా సెలవులకు (Dasara Holidays 2025) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు అంటే… 13 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అలాగే , జూనియర్ కాలేజ్‌లకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు అంటే… 8 రోజుల పాటు దసరా హాలిడేస్ ఉండనున్నాయి. పాఠశాలలు అక్టోబర్ 4న పునఃప్రారంభమవుతుండగా ఆ రోజు శనివారం అవుతుంది. అయితే మరసుటి రోజు (అక్టోబర్ 5) ఆదివారం మళ్లీ స్కూళ్లకు సెలవు ఉంటుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








