Colleges Bandh September 15 : పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) , స్కాలర్‌షిప్స్ (Scholarships,) వెంటనే విడుదల చేయాలని కొన్ని రోజులుగా విద్యార్థులు, ఇటు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో పాటు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పందించకపోవడంతో విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ వెంటనే విడుదల చేయాలని అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అన్ని కాలేజీలను నిరవధికంగా బంద్ చేయనున్నట్టు ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 10 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ను కలిసి నోటీసు అందజేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయనందుకు నిరసనగా ఇంజినీర్స్ డేను బ్లాక్‌డేగా పాటిస్తామని ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    